Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్ సలా రీఎంట్రీ అదిరింది.. టాప్‌లో లివర్‌పూల్

ప్రీమియర్ లీగ్‌లో మహమ్మద్ సలా రీఎంట్రీ అదిరింది. గోల్ కొట్టి జట్టు గెలుపుతో కీలకపాత్ర పోషించాడు. బ్రెంట్‌ఫోర్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్ ఘనవిజయం సాధింది. 4-1 గోల్స్ తేడాతో నెగ్గింది.

ఆఫ్రికా కప్ నేషన్స్‌లో ఈజిప్ట్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు మహమ్మద్‌కు గజ్జల్లో గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన రీఎంట్రీ కోసం బెంచ్ మీద ఎదురుచూసిన అతడు ఎట్టకేలకు మైదానంలో అడుగుపెట్టాడు. అలెక్సిస్ మాక్ అలిస్టర్‌కు గోల్ చేయడానికి అద్భుతమైన పాస్ ఇచ్చి అతడు జట్టు తరఫున మూడో గోల్ కూడా కొట్టాడు.

Mohamed Salah celebrates scoring on his Liverpool return

డార్విన్ నునెజ్ శుభారంభం చేశాడు. సూపర్ చిప్‌తో గోల్ చేసి స్కోరింగ్ ప్రారంభించాడు. మరోవైపు బ్రెంట్ ఫోర్డ్ ఆటగాడు ఇవాన్ టోనీ తన ఫామ్‌ను కొసాగించాడు. గోల్ కొట్టి 3-1తో జట్టును తిరిగి పోటీలోకి తెచ్చాడు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గక్పో ఆఖరి క్షణాల్లో గోల్ కొట్టి లివర్‌పూల్ ఆధిక్యాన్ని 4-1కి పెంచాడు.

ఆతిథ్య జట్టు బ్రెంట్‌ఫోర్డ్ తొలి అర్ధభాగంలో గట్టిపోటీనిచ్చింది. విటాలీ జనెల్ట్ మొదటి నాలుగు నిమిషాల్లోనే గోల్‌కు ప్రయత్నించాడు. లెఫ్ట్ ఫుట్‌తో షాట్ ఆడాడు. కానీ ఫలించలేదు. అయితే పర్యాటక జట్టు లివర్‌పూల్‌కు కోనర్ బ్రాడ్ల అవకాశం ఇచ్చాడు. బాక్స్‌లో ప్రవేశించాడు. కానీ గోల్ కీపర్ మార్క్ ఫ్లెకెన్ సేవ్ చేశాడు.

గత ఆరు గేమ్‌ల్లో అయిదు గోల్ కొట్టిన నీల్ మౌపే 15 నిమిషాల తర్వాత టోనీకి మంచి ప్రొవైడర్‌గా మారాడు. ఇంగ్లండ్ స్ట్రైకర్ కోసం రివర్స్ బాల్‌ను స్లైడింగ్ చేశాడు. కానీ అతని ప్రయత్నం కూడా ఫలించలేదు. టోనీ, క్రిస్టియన్ వైడ్ రేంజ్ షాట్స్ ఆడారు. కాగా, లీగ్‌లో లివర్‌పూల్ టాప్‌లో ఉంది.

Story first published: Saturday, February 17, 2024, 21:29 [IST]
Other articles published on Feb 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+