Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీఎఫ్ఎ ప్లేయర్స్ ఆప్ ది ప్లేయర్ మొహమ్మద్ సలాహ్

Mohamed Salah pips Kevin De Bruyne to PFA Players Player of the Year award

హైదరాబాద్: లివర్‌పూల్ జట్టు ప్లేయర్‌గా తొలి సీజన్‌లోనే గోల్స్ సాధించి రికార్డులు నెలకొల్పిన ప్లేయర్ మహ్మద్ సాలేహ్ ఈ ఏడాది పీఎఫ్ఏ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చేజిక్కించుకున్నాడు. ఈ ఈజిప్టు ఫార్వర్డ్ ప్లేయర్ ప్రస్తుత సీజన్‌లో ప్రీమియర్ లీగ్ టోర్నీలో 33 మ్యాచ్‌ల్లో 31 గోల్స్ సాధించాడు. రోమా నుంచి ప్రారంభంలో 36.9 మిలియన్ల యూరోలకు గత ఏడాది జూన్‌లో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి అత్యధిక ప్రొఫైలిక్ క్యాంపెయిన్ సాధించడంతోపాటు సరికొత్త రికార్డులు నెలకొల్పాడు.

మొహమ్మద్ సలాహ్‌తోపాటు బరిలో కెవిన్ డీ బ్రూనే, హర్రీ

మొహమ్మద్ సలాహ్‌తోపాటు బరిలో కెవిన్ డీ బ్రూనే, హర్రీ

పీఎఫ్ఎ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం మొహమ్మద్ సలాహ్‌తో పాటు ఇప్పటికే ప్రీమియర్ లీగ్ టోర్నీలో కీలకంగా వ్యవహరించిన మాంచెస్టర్ సిటీ కెవిన్ డీ బ్రూనే, టొట్టెన్ హట్టం స్ట్రైకర్ హర్రీ కనే తర్వాత స్థానాల్లో నిలిచారు.

మొహమ్మద్ సలాహ్‌ను అభినందించిన జుర్గెన్ క్లోవ్

మొహమ్మద్ సలాహ్‌ను అభినందించిన జుర్గెన్ క్లోవ్

ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఆడిన ప్లేయర్‌కు ‘'పీఎఫ్ఎ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు' రావడానికి ఆయా ఆటగాళ్లకు అభిమానుల నుంచి లభించిన ఓట్లే కారణమని మొహమ్మద్ సలాహ్‌ తెలిపారు. పీఎఫ్ఎ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నందుకు సాలేహ్‌ను లివర్ పూల్ జట్టు మేనేజర్ జుర్గెన్ క్లోప్ అభినందించాడు.

తానింకా రికార్డులు బ్రేక్ చేయాల్సి ఉన్నందన్న సలాహ్

తానింకా రికార్డులు బ్రేక్ చేయాల్సి ఉన్నందన్న సలాహ్

ఈ సందర్భంగా మొహమ్మద్ సలాహ్‌ మాట్లాడుతూ తానింకా గోల్స్ చేయాల్సి ఉంది. రికార్డులు బ్రేక్ చేయాల్సి ఉందన్నారు. తనకు ఈ అవార్డు అందినందుకు ఆనందంగా ఉన్నదని తెలిపారు. తదుపరి మూడు మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డీ బ్రూనే కూడా తన ఓటు సాలేహ్‌కు వేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం లివర్ పూల్ జట్టుకు అన్ని టోర్నీల్లో కలిపి 41 గోల్స్ సాధించి పెట్టాడు మొహమ్మద్ సలాహ్‌. యన్‌ఫీల్డ్‌లో చాంపియన్స్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో తన మాజీ జట్టు రొమాతో తలపడనున్నాడు. వరుసగా మూడు నెలలుగా పీఎఫ్ఎ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న ప్లేయర్‌గా మొహమ్మద్ సలాహ్‌ నిలిచాడు. డీ బ్రూనే కొత్తగా ఏర్పాటు చేసిన ప్లే మేకర్ అవార్డు గెలుచుకునేందుకు రంగం సిద్ధమైంది.

పాశ్చాత్య మీడియా ప్రచారానికి భిన్నంగా రష్యాకు పోటెత్తనున్న సాకర్ అభిమానులు

పాశ్చాత్య మీడియా ప్రచారానికి భిన్నంగా రష్యాకు పోటెత్తనున్న సాకర్ అభిమానులు

ఫిఫా 2018 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న రష్యాలో పరిస్థితులపై పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, మీడియా విషం చిమ్ముతున్నా వచ్చే జూన్ నెల 14వ తేదీ నుంచి జరిగే మ్యాచ్‌లను వీక్షించేందుకు ఆయా దేశాల నుంచే సాకర్ అభిమానులు పోటెత్తనున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. రష్యాకు వెళ్లాలని భావించే వారు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలని అమెరికన్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల ప్రారంభం నాటికే 16,462 అమెరికన్ ఫ్యాన్ అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేయడమే దీనికి నిదర్శనం.

రష్యాకు వచ్చే అభిమానుల్లో అత్యధికులు అమెరికన్లే

రష్యాకు వచ్చే అభిమానుల్లో అత్యధికులు అమెరికన్లే

రష్యాకు తరలి రానున్న అభిమానుల్లో అత్యధికులు అమెరికన్లే కావడం గమనార్హం. ‘అక్కడ ముప్పు తప్పక ఉంటుంది. ప్రతిరోజూ పశ్చిమ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూనే ఉంటాయి' అని రష్యా రాయబారి కార్యాలయం తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నది. దౌత్యాధికారుల మద్దతు లేకుండా రష్యాలో అమెరికన్లకు భద్రత కల్పించడం కష్ట సాధ్యమని ఇటీవల వైట్ హౌస్ సీనియర్ అధికారి చెప్పారు. ఇది ఇతర దేశాల పౌరులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

గ్రూప్ ఏలో రష్యాకు చోటు ఇలా

గ్రూప్ ఏలో రష్యాకు చోటు ఇలా

రష్యాలో జరిగే 2018 సాకర్ కప్ సంరంభంలో రష్యాతోపాటు సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే గ్రూప్ ఏలో ఉంటాయి. గ్రూప్ బీలో పోర్చుగల్, స్పెయిన్, ఇరాన్, మొరాకో దేశాల జట్లకు చోటు లభించింది. గ్రూప్ సీలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరు, డెన్మార్క్ ఆడతాయి. గ్రూప్ డీలో అర్జెంటీనా, ఐస్లాండ్, క్రొయేషియా, నైజిరియా ఉంటాయి. గ్రూప్ ఇ లో బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్తారికా, సెర్బియాలకు చోటు దక్కింది. గ్రూపు ఎఫ్ విభాగంలో జర్మనీ, మెక్సికో, స్వీడన్, దక్షిణ కొరియా ఆడతాయి. ఇక గ్రూప్ జీలో బెల్జియం, పనామా, ట్యునిషియా, ఇంగ్లండ్ జట్లు ఉంటాయి. చివరిగా గ్రూప్ హెచ్ విభాగంలో పోలండ్, కొలంబియా, సెనెగల్, జపాన్ దేశాల జట్లకు చోటు లభించింది.

Story first published: Monday, April 23, 2018, 16:39 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+