Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రొనాల్డోకు సరిజోడీ లివర్‌పూల్ మొహమ్మద్ సలాహ్‌

Mo Salah 15 years behind Cristiano Ronaldo – Klopp

హైదరాబాద్: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లీగా' జెయింట్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్, ఐదుసార్లు బాలోన్ డీ ఆర్ అవార్డు గ్రహీత క్రిస్టియానో రొనాల్డోను గట్టిగా ఢీ కొట్టేందుకు ప్రీమియర్ లీగ్ జట్లలో ఒక్కటైన లివర్ పూల్ టీం.. ఈజిప్టు ప్లేయర్‌ను మొహమ్మద్ సలాహ్‌ను నిలుపనుంది. 15 ఏళ్ల పాటు క్రిస్టియానో రొనాల్డోనూ మొహమ్మద్ సలాహ్‌ ఎదుర్కోనున్నాడని లివర్‌పూల్ మేనేజర్ జుర్గెన్ క్లోప్ తెలిపాడు.

44 మ్యాచ్‌ల్లో 32 గోల్స్ చేసిన మొహమ్మద్ సలాహ్‌

44 మ్యాచ్‌ల్లో 32 గోల్స్ చేసిన మొహమ్మద్ సలాహ్‌

అన్ ఫీల్డ్‌లో ఎదురు‌లేని ప్లేయర్‌గా నిలిచిన ఈజిప్టు సెన్షేషన్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్‌ను ఈ ఏడాది ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో 44 మ్యాచ్‌ల్లో 32 గోల్స్ సాధించి రికార్డును నెలకొల్పాడు. అంతటితో ఆగలేదు. ఈ 25 ఏళ్ల మొహమ్మద్ సలాహ్‌ గోల్డెన్ బూట్, పీఎఫ్ఎ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఎఫ్‌డబ్ల్యూఏ ఫుట్‌బాలర్ అవార్డు అందుకున్నాడు. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టుతో లివర్‍పూల్ ఈ నెల 26వ తేదీన తలపడనుంది. ఇదే ఈ ఏడాది బాలోన్ డీ ఆర్ అవార్డును నిర్దేశిస్తుంది.

రొనాల్డో రికార్డులను అధిగమించేందుకు సాలేహ్ అవకాశాలు పుష్కలం

రొనాల్డో రికార్డులను అధిగమించేందుకు సాలేహ్ అవకాశాలు పుష్కలం

అయితే క్రిస్టియానో రొనాల్డో రికార్డులను అధిగమించేందుకు మహ్మద్ సాలేహ్‌కు చాలా సుదూర మార్గం ఎదురుచూస్తోందని జుర్గెన్ క్లోప్ తెలిపాడు. నాలుగు చాంపియన్ షిప్ టైటిళ్లు, రెండు లాలీగ ట్రోపీలు, మూడు ప్రీమియర్ లీగ్ కప్ టైటిళ్లతోపాటు పలు టైటిళ్లు గెలుచుకున్న రికార్డులు క్రిస్టియానో రొనాల్డోకు సొంతం.

సాలేహ్ ముందు అద్భుతమైన సీజన్ ఇలా..

సాలేహ్ ముందు అద్భుతమైన సీజన్ ఇలా..

‘మొహమ్మద్ సలాహ్‌ ముందు అద్భుతమైన సీజన్ ఉంది. కానీ ఇప్పటివరకు క్రిస్టియానో రొనాల్డో 15 సీజన్లలో ఆడాడు' జుర్గెన్ క్లోప్ చెప్పాడు. క్రిస్టియానో రొనాల్డో 47 వేల గోల్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడా? అని అనిపిస్తుందన్నారు. ఒకరితో మరొకరిని సరిపోల్చడమేల? అని ప్రశ్నించాడు. పీలేతో ఎవరినైనా సరిపోల్చగలమా? అని వ్యాఖ్యానించాడు. ఆయనకు ఉండే మంచి లక్షణాలు ఆయనకు ఉన్నాయన్నాడు. ప్రస్తుతం మన ముందు లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్నారని చెప్పాడు. లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కొన్నేళ్లపాటు ఫుట్‌బాల్‌ను ఏలనున్నారని చెప్పాడు.

రిటైరైతేనే మెస్సీ, రొనాల్డో దూరం

రిటైరైతేనే మెస్సీ, రొనాల్డో దూరం

‘లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తరుచుగా గోల్స్ చేసేందుకు సరైన పొజిషన్ ఎంచుకుంటారు. ప్రపంచంలో దాన్ని గుర్తించడం కష్ట సాధ్యం. వారిద్దరు ఎక్కడ ఉంటే ‘బాలోన్ డీ ఓర్' అవార్డు అక్కడే ఉంటుంది. అందుకు వారు అర్హులే. వారు ఫుట్‌బాల్ నుంచి రిటైరైనప్పుడే మనకు దూరం అవుతారు.100 శాతం ఇటువంటి పరిస్థితి మొహమ్మద్ సలాహ్‌, రొనాల్డోకు వర్తింపజేయాలని నేను భావించడం లేదు. ఇది వ్యక్తుల ఆట తీరు గురించి కాదు. ఫుట్‌బాల్ ఆటతీరు గురించి ఆలోచించాల్సి ఉంది' అరి జుర్గిన్ క్లోప్ తెలిపాడు.

Story first published: Sunday, May 20, 2018, 14:52 [IST]
Other articles published on May 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+