చెన్నై మిస్ ఫైర్: కోల్‌కతాతో మ్యాచ్ డ్రా
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ ఎఫ్ సి కుర్రాళ్లు ఒక గోల్ చేయడంలో వెనుకబడటంతో మాజీ చాంపియన్లు అట్లెటికో డీ కోల్‌కతా తిరిగి టాప్ 4 జట్లలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ టాప్ పోరులో వెనకుబడింది.
కోల్ కతా సారధి హెల్డర్ పొస్టిగ 39వ నిమిషంలో గోల్ సాధిస్తే, సెకండాఫ్‌లో 77వ నిమిషంలో చెన్నై కుర్రాడు గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు. తత్ఫలితంగా మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో చెన్నైయిన్ 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
మరోవైపు 11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు సాధించి ఆరోస్థానంలో సెటిలైంది. కేరళ, ఎఫ్ సి పుణె సిటీ, కేరళ బ్లాక్ బస్టర్స్ కూడా 15 పాయింట్లతో స్థిర పడ్డాయి. పాయింట్ల టేబుల్‌లో అట్లెటికో డీ కోల్‌కతా (ఎటికె) ప్లస్ వన్‌తో ముందు వరుసలో నిలబడగా, పుణె మైనస్ వన్, కేరళ బ్లాక్ బస్టర్స్ మైనస్ 4తో తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.
తొలి ఫస్టాఫ్‌లో మాజీ చాంపియన్సు అట్లెటికో డీ కోల్ కతా ఎంజాయ్ చేస్తే, సెకండాఫ్ లో పూర్తిగా చెన్నైయిన్ ప్లేయర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఆతిథ్య జట్టు కోచ్ జోస్ మొలినా తొలిసారి అమలుచేసిన వ్యూహం అందరినీ ఆశ్చర్య చకితులనుచేసింది.

ఇయాన్ హుమ్‌ను బెంచ్‌కే పరిమితం
జువాన్ బెలెంకోసోతో మ్యాచ్‌ను ప్రారంభించి జట్టులో కీలకమైన కెనడియన్ స్ట్రయికర్ - అత్యధిక గోల్స్ స్కోరర్ ఇయాన్ హుమ్‌ను బెంచ్‌కే పరిమితం చేశాడు. హుమ్ గైర్హాజరీలో ఎటికే అవకాశాలు మిస్సవ్వలేదు. కోల్‌కతా అటాకింగ్ వ్యూహానికి ఎటువంటి అడ్డంకులు తలెత్తలేదు. మూడో నిమిషంలోనే కోల్ కతా కుర్రాళ్లలో లాల్రిండికా రాల్టే తెలివిగా పంపిన బంతిని సారధి పొస్టిగ కుడివైపు నుంచి పంపిన హెడ్డర్ పక్కకు తిరిగి వెళ్లిపోయింది.

చెన్నైయిన్ జట్టుకు నిజంగా లక్కీ ఎస్కేప్
అవకాశం కోసం ఎదురుచూస్తున్న కోల్‌కతా ప్రారంభంలోనే గోల్ చాన్స్ మిస్సవ్వడం నిజంగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ జట్టుకు నిజంగా లక్కీ ఎస్కేప్. చెన్నై సంచలనం జెజె లాల్ఫెఖ్లౌ కోసం రాఫెల్ అగస్టో ప్లిక్ చేసిన బంతి హన్స్ ముల్డర్ ముందు నుంచి దాటుకుని వెళ్తుంటే.. ఆయన గోల్ పోస్ట్‌కు పంపేందుకు చేసిన ప్రయత్నాన్ని కోల్‌కతా కీపర్ దేబ్జిత్ మజుందార్ దిగ్విజయంగా అడ్డుకున్నాడు.

39వ నిమిషంలో పొస్టిగ గోల్
చెన్నైయిన్ జట్టు కుర్రాళ్లు కూడా తమ సొంత గడ్డపై చాలా క్రమశిక్షణాయుతంగా వ్యవహరించారు. 39వ నిమిషంలో పొస్టిగ గోల్ కొట్టే వరకు చెన్నై కుర్రాళ్లు గోల్స్ సాధించే సంగతే పట్టించుకోలేదు. అంతర్గతంగా జావీ లారా, ప్రీతం కోటల్ ఒకింత అవగాహనతో ముందుకు సాగారు. కోటల్ అందమైన బంతిని డేంజర్ జోన్ లో ఉన్న పొస్టిగకు పంపితే.. అది అక్కడి నుంచి గోల్ పోస్ట్ ను చేరుకునేలోగా కీపర్ కరంజిత్ సింగ్ అడ్డంకొట్టాడు.

చెన్నైయిన్ వేగంగా పుంజుకుంది
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో సెకండాఫ్‌లో చెన్నైయిన్ చాలా వేగంగా పుంజుకుని గోల్ సాధించేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేసింది. తద్వారా అభిమానుల మద్దతును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నది. ఇటాలియన్ స్ట్రయికర్ డేవిడ్ సుక్కీ పదేపదే గోల్ పాయింట్ సాధనకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయన చురుగ్గా స్పందించకపోవడం వల్లే గోల్ సాధించలేకపోయాడు.

రెండుసార్లు గోల్స్ మిస్
56వ నిమిషంలో కుడివైపు నుంచి జకీర్ ముందాంపరా పంపిన బంతి సుక్కీని తాకుతూ వెళ్లిపోయింది. 71వ నిమిషంలో ఒంటరిగా అన్నివైపుల నుంచి పరిశీలిస్తూ కుడివైపు నుంచి పంపిన బంతి గోల్ పోస్ట్ దరి చేరలేదు. రెండుసార్లు గోల్ మిస్సవ్వడంతో 77వ నిమిషంలో ఎలి సాబియా డిఫెండర్ గా వేగంగా పంపిన బంతిని సుక్కీ అంతే వేగంగా పక్కకు కట్ చేయడంతో నేరుగా బంతి గోల్ పోస్ట్ కు చేరిపోయి స్కోర్ సమమైంది.

ఫలించని అట్లెటికో డీ ప్రయత్నాలు
తర్వాత అట్లెటికో డీ కుర్రాళ్లు మరో గోల్ చేసి లీడ్ సాధించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చెన్నైయిన్ కుర్రాళ్లకు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగంచేసుకోలేకపోయారు. దాంతో మూడు పాయింట్లు సాధించి టాప్ 4లో చోటు దక్కించుకునే అవకాశాన్ని చెన్నైయిన్ కుర్రాళ్లు కోల్పోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications