Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టోల్ రాకతో భారత్ ఫుట్‌బాల్‌కు మంచి రోజులే

కోల్‌కతా: దేశంలోని వివిధ యువ టీమ్‌లకు ఇన్‌చార్జిగా వ్యవహరించి, పలువురు జాతీయ ఆటగాళ్లను తయారుచేసిన కోల్మ్ టోల్ రాకతో భారత ఫుట్ బాల్ ఆటకు మంచి రోజులు వచ్చినట్లేనని కోల్‌కతా జెయింట్స్ మొహున్ బగన్ హెడ్ కోచ్ సంజయ్ సేన్ వ్యాఖ్యానించాడు.

ఈ ఏడాది ఎఐఎఫ్ఎఫ్ ప్లేయర్ జెజె లాల్పెఖ్లౌ, యూరప్ లీగ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నఏకైక ఇండియన్ గురుప్రీత్ సింగ్, మిడ్ ఫీల్డర్ ప్రొనయ్ హల్డర్ తదితరులకు శిక్షకుడిగా కోల్మ్ టోల్ పనిచేశాడు. అప్పట్లో భారత్ లోని అన్ని విభాగాల జట్లకు అసిస్టెంట్ కోచ్‌గా సంజయ్ సేన్ వ్యవహరించాడు.

'ఐ - లీగ్ టీం మినర్వ పంజాబ్ ఫ్రాంచైసీ యాజమాన్యం కోల్మ్ టోల్‌ను తమ టెక్నికల్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు వార్త పత్రికల్లో చూశా. ఇది చాలా గొప్ప వార్త. నేను కోల్మ్ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశా. భారత ఫుట్ బాల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ప్లేయర్లంతా ఆయన శిష్యులే' అని మీడియాతో అన్నాడు.

ఇది చాలా గొప్ప పరిణామమని, దీర్ఘకాలికంగా ఫుట్ బాల్ ప్రగతిపై కేంద్రీకరించిన మినర్వ పంజాబ్ యాజమాన్యం ఆటపై సీరియస్‌గానే వ్యవహరిస్తున్నదన్నారు. రెండేళ్ల తర్వాత చెన్నై సిటీ ఎఫ్ సి, చర్చిల్ బ్రదర్స్ జట్లు ఐ - లీగ్‌లో పాల్గొంటున్నాయి. గోవాకు చెందిన క్లబ్‌లు వైదొలగడంతో మొహన్ బగన్ జట్టు పని తేలికైంది.

ఆ జట్లు చాలా క్లిష్టమైనవి

ఆ జట్లు చాలా క్లిష్టమైనవి

గోవాకు చెందిన డెంపో క్లబ్, పంజాబ్, చెన్నైల నుంచి వేర్వేరు జట్లు చాలా క్లిష్టమైనవని ఆయన చెప్పాడు. ఈ దఫా తమ లక్ష్యం టైటిల్ ను కైవసం చేసుకోవడమేనని, కానీ ఏ కోచ్ కూడా అందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేడన్నాడు. టైటిల్ పోరు కోసం మొహన్ బగన్ ప్రధాన పోటీదారుగా ఉంటుందన్నాడు. ఐ - లీగ్ టోర్నీ కోసం మొహున్ బగన్ ట్రైనింగ్ సెషన్ సోమవారం ప్రారంభమైంది. జనవరి మూడో తేదీ నుంచి జెజె, హైతియన్ ఫార్వర్డ్ సోనీ నోర్డే ట్రైనింగ్‌లో పాల్గొంటారు.

తన చెల్లెలు వివాహం కారణంగా శిక్షణకు గైర్హాజరు

తన చెల్లెలు వివాహం కారణంగా శిక్షణకు గైర్హాజరు

జట్టులో కొత్తగా ప్రవేశిస్తున్న సెంటర్ బ్యాక్ అనాస్ ఎడాథోడికా తన చెల్లెలు వివాహం కారణంగా తర్వాత శిక్షణకు హాజరవుతారు. ఇక ఎడౌర్డో సోర్స్ ఫెరీరా వీసా రాగానే బయలుదేరి వస్తాడు. మొహున్ బగన్ ప్రత్యర్థి ఈస్ట్ బెంగాల్ జట్టు సైతం సమర్థులైన భారతీయ ప్లేయర్లతోనే ఒప్పందాలు చేసుకున్నది. ‘వారి విదేశీ ఆటగాళ్లెవరో నాకు తెలియదు. కానీ ఇండియన్ ప్లేయర్లు మంచి సామర్థ్యం ఉన్న వారే. జాకీచంద్ సింగ్, థోంగ్ కోసిం హావోకిప్, రోమియో ఫెర్నాండెజ్ చాలా మంచి ఆటగాళ్లు, రౌల్లిన్ బోర్జెస్ కూడా' అని వ్యాఖ్యానించాడు.

సంయుక్తంగా స్కూళ్లలో ఫుట్ బాల్ ప్రచారం

సంయుక్తంగా స్కూళ్లలో ఫుట్ బాల్ ప్రచారం

ముంబై: వెస్ట్రన్ ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్, ఐఎస్ఎల్ క్లబ్ ముంబై సిటీ ఎఫ్ సి యాజమాన్యాలు సంయుక్తంగా ముంబై నగరంలో ఫుట్ బాల్ క్రీడ ప్రోత్సాహానికి చొరవ తీసుకున్నాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబై ఆధ్వర్యంలో కొన్ని నగరంలోని స్కూళ్లలో ఫుట్ బాల్ ఆటకు గల ఆవశ్యకత గురించి ప్రచారం చేయనున్నాయి. ‘జస్ట్ ప్లే' సెషన్స్ పేరిట వచ్చే మార్చి నుంచి పది స్కూళ్లలో ప్రచారం నిర్వహిస్తాయి. సుమారు 80 స్కూళ్లలో ప్రచారం ద్వారా ముంబై నగరంలో 30 వేల మందికి తమ వాయిస్ చేరాలని నిర్ణయించుకున్నాయి. దీంతోపాటు కల్యాణ్, దోంబివాలి, అంబర్ నాథ్, థానె జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడతాయి. ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఓషియానా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ చొరవతో భారత్‌లోనూ ఎఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యంతో ‘జస్ట్ ప్లే' కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఓఎఫ్ సి ఆధ్వర్యంలో 11 పసిఫిక్ ఖండ దేశాల్లో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడమే దీనికి స్ఫూర్తి.

ముంబై సిటీపై ఎఐఎఫ్ఎఫ్ ఫైన్

ముంబై సిటీపై ఎఐఎఫ్ఎఫ్ ఫైన్

ఇటీవల ముగిసిన ఐఎస్ఎల్ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె)తో జట్టు దుష్ప్రవర్తనతో వ్యవహరించినందుకు ముంబై సిటీ సిటీ ఎఫ్ సి జట్టుపై రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) తెలిపింది. ముంబై ప్లేయర్ థియాగో దాస్ శాంతోస్ చున్హా తన ప్రత్యర్థి జట్ల ప్లేయర్లతో క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించినందుకు నాలుగు మ్యాచ్ ల నిషేధంతోపాటు రూ.3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపింది. మరో ప్లేయర్ ఫకుండో కార్డోజోపై మూడు మ్యాచ్‌లు నిషేధం విధించగా, అధికారి భూషణ్ టాండెల్ పై ఐదు మ్యాచ్ ల నిషేధంతోపాటు రూ. లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. ముంబైలో జరిగిన రెండో సెమీ ఫైనల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబైకి చెందిన లియో కోస్టా, ఎటికె ప్లేయర్ బెలెంకోసో మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఇరు జట్ల ప్లేయర్లు క్రమశిక్షణ ఉల్లంఘించారని ఎఐఎఫ్ఎఫ్ వివరించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+