మినర్వ పంజాబ్ జట్టులోకి చెన్నైయిన్ త్రయం
చండీగఢ్: తొలిసారి ఐ లీగ్ టోర్నీలో అడుగు పెట్టిన మినర్వ పంజాబ్ టెక్నికల్ డైరెక్టర్‌గా కోల్మ్ టోల్ సారధ్యంలో క్లబ్ ఫ్రాంచైసీ చకచకా అడుగులు ముందుకేస్తూ జట్టు పటిష్టం దిశగా సాగుతోంది. అందులో భాగంగా ఇతర జట్లలోని మేటి ఆటగాళ్లపై ప్రత్యేకించి కుర్రకారు మీదే కేంద్రీకరించింది.
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మాజీ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సి ప్లేయర్లు అనిరుధ్ థాపా, ఉత్తమ్ రాయ్, బావోరింగ్డావో బోడోలను తమ టీం సభ్యులుగా చేర్చుకున్నది. ఈ మేరకు వారితో ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఈ ముగ్గురితోపాటు లైస్రాం బెదాశ్వర్ సింగ్‌ను కూడా తమ జట్టులో కలుపుకునేందుకు సమాయత్తం అవుతున్నది.

ఎఐఎఫ్ఎఫ్ అకాడమీలో శిక్షణ పొందిన వారే
వీరు ముగ్గురు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అకాడమీలో శిక్షణ పొందిన వారే. ఇంతకుముందు ఫ్రెంచ్ ఎఫ్ సి మెట్జ్ జట్టులోనూ ఆడారు. అసోంకు చెందిన వినీత్ రాయ్ ఇంతకుముందు కేరళ బ్లాక్ బస్టర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే వైద్య పరీక్షల్లో ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంటుంది. ఇంతకుముందు మినర్వ పంజాబ్ జట్టు మానన్ దీప్ సింగ్, రమణ్ దీప్ సింగ్, మొయినుద్దీన్ ఖాన్‌లనూ టీమ్‌లో చేర్చుకున్నది.

మినర్వ పంజాబ్ జట్టులో చేరేందుకు ఆసక్తి
యు-19 మాజీ కెప్టెన్ షౌవిక్ దాస్, స్పోర్టింగ్ క్లబ్ డీ గోవా ప్లేయర్ జొవెల్ మార్టిన్స్ కూడా మినర్వ పంజాబ్ జట్టులో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గత సెషన్‌లో ఐజ్వాల్ ఎఫ్ సి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన నైజీరియన్ జోయల్ యింకా, మొహున్ బగన్ సెంట్ ఆఫ్ దీపక్ దివ్రాణి కూడా మినర్వ పంజాబ్ జట్టులో సభ్యులుగా చేరిపోయారు.

ఏషియాన్ కోటాలో మొఘ్రాబీ చేరికకు ఈస్ట్ బెంగాల్ యత్నం
ఆసియా క్రీడాకారుల కోటలో కోల్‌కతా ఫుట్‌బాల్ జెయింట్స్‌లో ఒక్కటైన ఈస్ట్ బెంగాల్ క్లబ్.. లెబనాన్ ప్లేయర్ అక్రం మొఘ్రాబీని చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఇంతకుముందు దక్షిణ కొరియా ప్లేయర్ డో దోంగ్ హ్యూన్ పేరును కోచ్ ట్రెవోర్ మోర్గాన్ ఆమోదించలేదు. ఆసియా కోటాలో మోఘ్రాబీని చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నది.

లెబనాన్ తరఫున 26 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం
మోఘ్రాబీ ఇప్పటివరకు లెబనాన్ తరఫున 26 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 31 ఏళ్ల ఈ ఫార్వర్డ్ ప్లేయర్ 16 గోల్స్ చేశాడు.ప్రస్తుతం నెజ్మెహ్ ఎస్ సి తరఫున ప్రాతినిధ్యం వహించిన మోఘ్రబీ 2012 - 13 సీజన్ ఐ - లీగ్ టోర్నీని చర్చిల్ బ్రదర్స్ జట్టు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. చర్చిల్ జట్టులో ఆడినప్పుడు హ్యాట్రిక్ సహా మొత్తం పది గోల్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్లేయర్ విల్లిస్ ప్లాజా, ఉగాండా ఆటగాడు ఇవాన్ బుకున్యా, హైతీయన్ వెడ్సన్ అంసెల్మె కూడా ఈస్ట్ బెంగాల్ టీంలో విదేశీ ఆటగాళ్లుగా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications