
29 గోల్స్‌తో రెండోస్థానంలో గోవా
అయితే గతేడాది తొలి 14 మ్యాచ్‌ల్లోనే ఎఫ్ సి గోవా జట్టు 29 గోల్స్‌తో రెండోస్థానంలో నిలబడింది. ఢిల్లీ డైనమోస్ సాధించిన గోల్స్‌లో బ్రెజిలియన్ ఇంద్రజాలికుడు మార్సిలిన్హో నేరుగా, అసిస్టెన్స్ ద్వారా సాధించినవి 14. రియో డి జనెరియో నుంచి వచ్చిన ఈ 29 ఏళ్ల కుర్రాడే ఢిల్లీ డైనమోస్ జట్టులో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు.

ఢిల్లీ డైనమోస్
గత సీజన్‌లో స్టివెన్ మెండోజా (13 గోల్స్, మూడు అసిస్టెన్స్ ప్లస్ 16), ఇయాన్ హుమ్ (11 గోల్స్ 4 అసిస్టెన్స్ ప్లస్ 15) గోల్స్ రికార్డు భాగస్వామ్యాన్ని కూడా అధిగమించి చరిత్ర నెలకొల్పుతాడా? అన్న భావన కలుగుతున్నది. ప్రస్తుత సీజన్‌లో మూడు గోల్స్ సాధించిన తర్వాత కూడా ఎఫ్ సి పుణె సిటీ జట్టు చేతిలో 4 - 3 స్కోర్ తేడాతో ఓటమి పాలైన జట్టు ఢిల్లీ డైనమోస్ మాత్రమే.

అటాకింగ్ వ్యూహానికి ఢిల్లీ డైనమోస్ బెంచ్ మార్క్
ఒకవేళ అటాకింగ్ వ్యూహానికి ఢిల్లీ డైనమోస్ బెంచ్ మార్క్ సెట్ చేస్తే.. ఇతర జట్లకు డిఫెన్స్ మార్గం చూపిన క్రెడిట్ ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుకు దక్కుతుంది. తొలిసారి సెమీస్‌లో అడుగు పెట్టిన ముంబై గతేడాది కేవలం 16 గోల్స్ మాత్రమే నమోదుచేసింది. డిఫెన్స్ అయినా మరేదైనా ఈ ఏడాది ముంబై సిటీ ఎఫ్ సి టోర్నీలో అనుసరించిన వైఖరి విభిన్నంగానే ఉంది.

డిఫెన్సివ్ వ్యూహంతో ముంబై చరిత్ర
డిఫెన్సివ్ వ్యూహంతో ముందుకు సాగిన ముంబై సిటీ కేవలం 8 గోల్స్ మాత్రమే ఇచ్చి ఐఎస్ఎల్ టోర్నీలో చరిత్ర నెలకొల్పింది. ఎనిమిది క్లీన్ చిట్లు కూడా నమోదుచేసింది. కేరళ బ్లాక్ బస్టర్స్‌కు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్ లో 5 - 0 స్కోర్ సాధిస్తే డియాగో ఫోర్లాన్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి ముంబై జట్టుకు గర్వకారణమయ్యాడు. సునీల్ ఛెత్రి, అండ్రె మొరిట్జ్ లతో కలిసి సాధించిన అతి పెద్ద విజయమిదే.

నాలుగు మ్యాచ్‌ల్లో విజయంతోనే సెమీ ఫైనల్స్ అర్హత
వరుసగా మూడేళ్లుగా సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన టీం అట్లెటికో డీ కోల్‌కతా మాత్రమే. కోల్‌కతా జట్టు కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో విజయంతోనే సెమీ ఫైనల్స్ దశకు అర్హత సాధించడం అనూహ్య పరిణామమే. ఎనిమిది మ్యాచ్‌లను డ్రాగా ముగించి సెమీ ఫైనల్స్ కు చేరి కోల్ కతా జట్టు రికార్డు నెలకొల్పింది. అయితే కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలవ్వడం కూడా నాకౌట్ దశకు కోల్ కతా అర్హత సాధించడానికి గల కారణం.

గోవా, చెన్నైయిన్ జట్లు సెమీస్ నుంచి ఔట్
ఎఫ్‌సి గోవా, చెన్నైయిన్ ఎఫ్ సి జట్లు ప్రారంభంలోనే సెమీస్ బరి నుంచి వైదొలిగితే.. అట్లెటికో డీ కోల్ కతా మాత్రమే ప్రతి ఎడిషన్ లోనూ సెమీస్ కు అర్హత సాధించిన టీంగా గుర్తింపు పొందింది. గత ఏడాది చాంపియన్, రన్నరప్ జట్లు చెన్నైయిన్, గోవా మధ్య ఈ ఏడాది పాటోర్డా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ముగించాయి.

ఓటమి పాలైన రికార్డు చెన్నయిన్‌దే
ఇదే స్టేడియంలో గత ఏడాది రెండు జట్లు ఫైనల్స్‌లో థ్రిల్లింగ్ ఫలితాన్ని నమోదుచేశాయి. ఈ ఏడాది సూపర్ మాచన్లపై గౌర్లు అత్యధికంగా 5 - 4 స్కోర్ నెలకొల్పిన రికార్డు సాధించాయి. నాలుగు గోల్స్ సాధించిన తర్వాత తొలిసారి మ్యాచ్ ఓటమి పాలైన రికార్డును కూడా చెన్నైయిన్ ఎఫ్ సి జట్టు సొంతంచేసుకున్నది.


Click it and Unblock the Notifications













