Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగుళూరు ఫుట్ బాల్ జట్టును టాప్ పొజిషన్‌లో నిలబెట్టిన మికూ : ఐఎస్ఎల్

Miku does the star turn as Bengaluru FC stay at top of ISL after beating 10-man FC Pune City

హైదరాబాద్: ఐఎస్ఎల్‌లో భాగంగా గురువారం బెంగుళూరు జట్టు హోరాహోరీగా ఫూణె జట్టుతో తలపడింది. ఇరు జట్ల మధ్య పోటీతో అనుక్షణం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ చివరికి బెంగుళూరు జట్టు వైపుకు తిరిగింది. పూణెలోని శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య బెంగుళూరు జట్టును ఫూణె జట్టు ఓడించలేకపోయింది. 3-1 తేడాతో బెంగుళూరు జట్టు గెలిచింది.

ఈ మ్యాచ్‌లో మికూ కీలక ప్రదర్శన చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అదిల్ ఖాన్ ఒకానొక దశలో 35 వ నిమిషంలో పూణె జట్టును ఆధిక్యంలో ఉంచాడు. 45వ నిమిషం వరకు అదే పంథా కొనసాగించిన పూణె జట్టు
క్రమంగా పట్టు కోల్పోయింది. పూణె డిఫెండర్ బల్జిత్ సింగ్‌కు రెండో సారి ఎల్లో కార్డ్ రావడంతో మ్యాచ్ తిరిగిపోయింది.

బెంగుళూరు జట్టు హీరో మికూ మళ్లొక సారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు. జట్టు మొత్తం స్కోరు 3అయితే తానొక్కడే రెండు గోల్స్ చేసి జట్టు బలం చేకూర్చాడు. 64వ నిమిషం, 78 వ నిమిషాలలో రెండు గోల్‌లు సాధించాడు.

ఇప్పటి వరకు పది గోల్స్ కి గాను ఏడు సాధించిన బెంగుళూరు జట్టుకు బాగా కలిసొచ్చింది. మొదటి సారి రెడ్ కార్డ్‌తో మ్యాచ్ నుంచి వైదొలగిన పూణె జట్టు డిఫెండర్ బల్జిత్ సింగ్ ఈ సారి ఇంకా తొందరగానే ఎల్లో కార్డ్ తో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 12:00 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+