Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా ఆతిథ్య హక్కుల కేసు.. మైకేల్‌ ప్లాటిని అరెస్ట్‌

Michel Platini Released In 2022 World Cup Probe, questioned over awarding of World Cup to Qatar

ఫిఫా ప్రపంచకప్‌ 2022 టోర్నమెంట్‌ ఆతిథ్య హక్కులను కేటాయించడంలో అవినీతికి పాల్పడిన యూనియన్ ఆఫ్ యురోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్ (యుఈఎఫ్ఎ) మాజీ అధ్యక్షుడు మైకేల్ ప్లాటినీ (63)ని ఫ్రెంచ్ ఆంటీ కరప్షన్ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన కొన్ని గంటల తరువాత అతను రిలీస్ అయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫ్రెంచ్ ఫుట్‌బాల్ టీమ్‌‌కి సుదీర్ఘకాలం సేవలు అందించిన మైకేల్.. రిటైర్మెంట్ తర్వాత 2007లో యుఈఎఫ్ఎ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2014లో జరిగిన బిడ్డింగ్‌లో ఫిఫా నిబంధనలకు వ్యతిరేకంగా.. ఖతార్‌కు 2022 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కుల్ని కట్టబెట్టాడని ప్లాటినిపై ఆరోపణలు వచ్చాయి. 2015లో ప్లాటినిపై ఫిఫా ఎథిక్స్ కమిటీ ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. అనంతరం ఆ నిషేధాన్ని నాలుగేళ్లకి కుదించింది.

అప్పటినుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఫ్రెంచ్ పోలీసులు మైకేల్‌ ప్లాటినిని అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం ఫ్రెంచ్ ఆంటీ కరప్షన్ మైకేల్‌ ప్లాటినిని విచారించి రిలీజ్ చేసింది. ప్లాటినితో పాటు గతంలో ఖతార్‌కి అనుకూలంగా ఓటేసిన 16 మందిపై నిషేధం విధించి విచారణ జరుపుతున్నారు. రష్యా వేదికగా 2018లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ గెలుచుకుంది.

Story first published: Wednesday, June 19, 2019, 10:50 [IST]
Other articles published on Jun 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+