Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్ ఫుట్ బాల్ లో మెక్సికో, జర్మనీ రికార్డులు

FIFA World Cup 2010
క్రికెట్ కు ఉన్నన్ని రికార్డులు ఫుట్ బాల్ కు లేకపోయినా, ఉన్న కొద్ది రికార్డులు చిరస్మరణీయాలు. అత్యధిక పర్యాయాలు ప్రపంచకప్‌ ల్లో పాల్గొన్న రికార్డు ఇద్దరు ఆటగాళ్ల పేరుమీదుంది. మెక్సికో ఆటగాడు ఆంటోనియో కర్బజాల్, జర్మనీ మాజీ కెప్టెన్ లోథార్ మథియాస్‌లు మొత్తం ఐదు ప్రపంచకప్ ‌ల్లో ఆడి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

అత్యధికంగా 25 ప్రపంచకప్ మ్యాచ్ ‌ల్లో ఆడిన రికార్డు కూడా మథియాస్ సొంతం. బ్రెజిల్ దిగ్గజం పీలే ఒక్కడే మూడు సార్లు ప్రపంచకప్ విజేత మెడల్స్‌ను అందుకున్నాడు. మరో ఇరవై మంది రెండుసార్లు ఈ మెడల్స్‌ను అందుకున్న వారిలో ఉన్నారు.

అన్ని వరల్డ్‌కప్‌ల్లో ఓవరాల్ టాప్ గోల్ ‌స్కోరర్ ‌గా బ్రెజిల్ సూపర్ ఫార్వర్డ్ రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం మూడు ప్రపంచకప్ ‌ల్లో ఆడిన రొనాల్డో 15 గోల్స్ చేశాడు. రెండో స్థానంలో 14 గోల్స్ తో పశ్చిమ జర్మనీ ఆటగాడు గెర్డ్ ముల్లర్ నిలిచాడు.

ఇక మూడో స్థానంలో ఫ్రాన్స్ దిగ్గజం జస్ట్ ఫోంటేన్ (13) నిలిచాడు. జస్ట్ ఫోంటేన్ గొప్పదనమేంటంటే అతను సాధించిన మొత్తం 13 గోల్స్ అన్నీ ఒక్క 1958 టోర్నీలో సాధించనవే కావడం విశేషం. ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచకప్‌లను గెల్చి...బ్రెజిల్‌కు చెందిన మారియో జగాలో, పశ్చిమ జర్మనీ ఆటగాడు ఫ్రాంజ్ బెకన్ ‌బాయర్ ‌లు రికార్డు సృష్టించారు.

జగాలో 1958, 1962లో ఆటగాడిగా, 1970లో హెడ్‌కోచ్‌గా, బెకన్‌ బాయర్ 1974లో కెప్టెన్‌ గా 1990లో కోచ్‌ గా ప్రపంచకప్‌ ను అందించారు. ఇక బ్రెజిల్, జర్మనీలు ఇప్పటివరకూ 92 ప్రపంచకప్ మ్యాచ్‌లాడాయి. బ్రెజిల్ అత్యధికంగా 201 గో ల్స్ చేసి అనితర సాధ్యమైన రికార్డును సృష్టించింది. జర్మనీ, బ్రెజిల్‌ లు ప్రపంచకప్ లో ముఖాముఖి తలపడింది ఒక్కసారే కావడం విశేషం.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+