Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెక్స్ వద్దు.. ఆటే ముద్దు: ఆటగాళ్లకు షాకిచ్చిన కోచ్

Mexico coach urges team to avoid World Cup sex
మెక్సికో: తమ జట్టు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు మెక్సికో కోచ్, మేనేజర్ మిగ్వెల్ హెరీరా ఓ కఠినమైన ఆదేశాన్ని జారీ చేశాడు. ప్రపంచకప్ జరుగుతున్నంత కాలంపాటు ఆట మీదే మనసు పెట్టాలని.. శృంగారాన్ని పక్కన పెట్టండని చెబుతున్నాడు. అంతేగాక ప్రపంచకప్ సందర్భంగా 40 రోజులపాటు శృంగారంలో కూడా పాల్గొనకుండా తన ఆటగాళ్లపై నిషేధం విధించాడు.

హెరీరా తమ ఆటగాళ్ల ఓ మినహాయింపు కూడా ఇచ్చాడు. అదేంటంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వైబ్‌సైట్లు వాడొచ్చట. అయితే సెక్స్ మాత్రం వద్దంటున్నాడు. ఈ సందర్భంగా హెరీరా మాట్లాడుతూ.. 'ఒక ఆటగాడు నెల లేదా 20 రోజులు శృంగారం లేకుండా ఉండకపోతే అతడు ప్రొఫెషనల్ ఆటగాడిగా ఉండేందుకు సిద్ధం కాదన్నమాట. మా జట్టులో మంచి ఆటగాళ్లున్నారు. వారు ప్రపంచకప్ సందర్భంగా శృంగారం కోసం తపించరు. ఏదైనా గొప్పగా చేయడానికి ఈ టోర్నీ మాకో అవకాశం కల్పిస్తోంది. కాబట్టి ఆటగాళ్ల ఆలోచనల్లో కూడా సెక్స్ ఉండదని భావిస్తున్నాను' అని తెలిపాడు.

40 రోజులు శృంగారంలో పాల్గొననంత మాత్రాన ఎవరూ చనిపోయే ప్రమాదమేమి లేదని ఘాటుగా చెప్పాడు. శృంగారాన్నే కాదు.. గొడ్డు మాంసాన్ని కూడా తినొద్దని ఆటగాళ్లను ఆదేశించాడు హెరీరా. కలుషితమైన మాంసం వల్ల డోప్ పరీక్షల్లో ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలుతుందనే భయమే ఇందుకు కారణమని అతడు చెబుతున్నాడు. 2011లో గొడ్డు మాంసం తినడం వల్ల డోప్ పరీక్షల్లో దొరకడంతో కాస్‌కాకఫ్ గోల్డ్‌కప్ టోర్నీ నుంచి మెక్సికో ఐదుగురు ఆటగాళ్లను ఉపసంహరించుకుంది.

మాంసాన్ని లేతగా మార్చేందుకు ఓ నిషేధిత ఉత్ర్పేరకాన్ని ఉపయోగించడం ఆటగాళ్లకు చేటు చేసందని తెలిపాడు. ఆ అనుభవం నేపథ్యంలోనే గొడ్డు మాంసం తినరాదని ఆటగాళ్లను ఆదేశించినట్లు చెప్పాడు. జూన్ 12 నుంచి జులై 13 వరకు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు జరగనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+