న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మెక్సొకో 2 కొట్టింది.. దక్షిణకొరియాను పడగొట్టింది

Mexico coach Juan Carlos Osorio urges action after South Korea commit 24 fouls

హైదరాబాద్: ప్రపంచకప్‌లో మెక్సికో జోరును దూకుడుగా కొనసాగిస్తోంది. అభిమానుల అశేష మద్దతుతో వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన మెక్సికో..స్థాయికి తగ్గ ఆటతీరుతో అదరగొడుతుంది. శనివారం గ్రూపు-ఎఫ్‌లో భాగంగా దక్షిణకొరియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 2-1తో విజయం సాధించి ఆరు పాయింట్లతో టాప్‌లోకి దూసుకొచ్చింది. మెక్సికో తరఫున కార్లోస్ వెలా(26ని), జేవియర్ హెర్నాండెజ్(66ని) గోల్స్ చేశారు. మరోవైపు ఆఖరి దాకా పోరాడిన దక్షిణకొరియా తరఫున సన్ హ్యుంగ్‌మిన్(93ని) ఏకైక గోల్ చేశాడు.

మ్యాచ్ మొదలైన మొదటి నిమిషం నుంచే ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. తమ తొలి మ్యాచ్‌లో జర్మనీని ఓడించి మంచి జోరుమీద బరిలోకి దిగిన మెక్సికో పక్కా ప్రణాళికను ఎంచుకుంది. దక్షిణకొరియాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయకుండా ఓవైపు మెరుపు దాడులు చేస్తూ..మరోవైపు ప్రత్యర్థి స్ట్రయికర్ దాడులను పటిష్ఠ డిఫెన్స్‌తో సమర్థంగా నిలువరించింది. మ్యాచ్‌లో 59శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న మెక్సికోకు 26వ నిమిషంలో కలిసొచ్చింది.

కొన్ని రోజుల క్రితం తన తాత మరణించిన బాధను దరిచేరనీయకుండా కార్లోస్ కొట్టిన పెనాల్టీ కిక్‌తో మెక్సికో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు జరిగిన 28 మ్యాచ్‌ల్లో 14 స్పాట్ కిక్ అవకాశాలు లభిస్తే..అందులో 11 గోల్ కావడం విశేషం. జర్మనీతో మ్యాచ్‌లో తనదైన శైలిలో ఆకట్టుకున్న హిర్వింగ్ లోజానో..మిడ్‌ఫీల్డ్‌ను సమనయ్వం చేస్తూ ముందుకు సాగాడు. మరోవైపు ైస్ట్రెకర్ లీ యాంగ్ చేసిన గోల్ ప్రయత్నాలు విఫలమవడంతో కొరియా ఆశలు నెరవేరలేదు.

కీలకమైన ద్వితీయార్ధాన్ని 1-0 ఆధిక్యంతో మొదలుపెట్టిన మెక్సికోకు..కొరియా నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఎలాగైనా స్కోరును సమం చేయాలనే ఉద్దేశంతో కొరియా ైస్ట్రెకర్లు దాడుల తీవ్రత పెంచారు. అయినా వెనుకకు తగ్గని మెక్సికో..పటిష్ఠమైన డిఫెన్స్‌తో దీటుగా బదులిచ్చింది. 56వ నిమిషంలో సహచర ైస్ట్రెకర్ అందించిన పాస్‌ను నేర్పుగా డ్రిబ్లింగ్ చేస్తూ జేవియర్ హెర్నాండెజ్ గోల్‌గా మలిచాడు. కొరియా డిఫెండర్‌ను కంగుతినిపిస్తూ హెర్నాండెజ్ బంతిని నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో మెక్సికో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

మెక్సికో తరఫున 104 మ్యాచ్‌లాడిన హెర్నాండెజ్ తన ఖాతాలో 50 గోల్స్ నమోదు చేసుకున్నాడు.మెక్సికోకు ఇంజ్యూరీ సమయంలో అనుకోని రీతిలో షాక్ తగిలింది. రాఫెల్ మార్కెజ్ తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ మ్యాచ్ అదనపు సమయం(90+3ని)లో సన్ హ్యుంగ్‌మిన్ సూపర్ గోల్ కొట్టాడు. దీంతో ఆధిక్యం 2-1కు పడిపోయినా మెక్సికోనే విజయం వరించింది.

Story first published: Sunday, June 24, 2018, 12:43 [IST]
Other articles published on Jun 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X