లండన్: అర్జెంటీనా జట్టు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనా మెస్సీ అసంతృప్తిని వెలిబుచ్చాడు. తనకు తిరిగి ఆడాలని ఉన్నా జట్టులోకి రానివ్వకపోవడం చాలా బాధాకరం అన్నాడు. ముప్పై ఏళ్ల వయస్సులోనూ తనకు ఆడటం చాలా కొత్త అనుభవాన్నిచ్చేదని మెస్సీ తెలిపాడు.
తాను ఆటలో ఉన్నంత సేపు వచ్చిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను చూపేందుకు ప్రయత్నించేవాడినని అయినా సరే తనను ఇలా పక్కన పెట్టేయడం సరికాదని మెస్సీ తెలిపాడు. ప్రస్తుతం తాను రిలాక్స్ ఉన్నానని, సహచరులతో ప్రవర్తించే తీరు సరికాదని పేర్కొన్నాడు.

2016లో కోపా అమెరికా సెంటినారియో టోర్నీలో చిలీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ విఫలం అనంతరం తాను జాతీయ జట్టుకు అందుబాటులో ఉండనని మెస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మెస్సీని జాతీయ జట్టు నుంచి తప్పించారు.
2007, 2015లతో కలిపి మెస్సీని ఇలా తప్పించడం నాలుగోసారి. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పరాభవం ఎదురుకావడంతో అర్జెంటీనా జట్టులో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. హెడ్ కోచ్‌గా గెరార్డో మార్టినోకి స్థానంలో ఎడ్గార్డో బౌజాని మార్చిన సంగతి తెలిసిందే.