Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: మెస్సి వర్సెస్ రొనాల్డో.. ప్రపంచకప్‌లలో ఎవరు బాగా ఆడారు?

Messi vs Ronaldo who plays better in Fifa World Cup tournaments

క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సి.. ఫుట్‌బాల్ ప్రపంచంలో ఈ రెండు పేర్లు తెలియని వాళ్లు ఉండరు. ఈ క్రీడకే ఐకన్లుగా మారిన ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఎంత రాణించినా.. తమ దేశానికి మాత్రం ఒక్క వరల్డ్ కప్ కూడా అందించలేకపోయారు. 2014లో మెస్సి తన కెరీర్‌ పీక్స్ చేరుకున్నాడు. అర్జెంటీనా జట్టును ఆ ఏడాది వరల్డ్ కప్ ఫైనల్ చేర్చాడు. కానీ ఫైనల్‌లో ఆ జట్టు ఓడిపోయింది. ఒక రొనాల్డో 2018లో అదరగొట్టాడు. టోర్నమెంట్‌లో నాలుగు గోల్స్ చేశాడు. కానీ ఆ జట్టు మాత్రం కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.

ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు తమ కెరీర్ చివరి దశలో ఉన్నారు. రొనాల్డో వయసు 37 ఏళ్లు. ఇక మెస్సి వయసు 35 సంవత్సరాలు. ఈ లెక్కన వీళ్లిద్దరూ మరో వరల్డ్ కప్ ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది. మరి తమ కెరీర్‌లో చివరిదైన ఈ వరల్డ్ కప్‌లో ఎవరు ఎలా రాణిస్తారో? తమ జట్టును ఎవరు గెలిపించుకుంటారో? అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఆడిన వరల్డ్ కప్స్‌లో ఈ ఇద్దరు లెజెండ్స్ ఎలా ఆడారో ఒకసారి చూస్తే..

2006 వరల్డ్ కప్..

2006 వరల్డ్ కప్..

ఈ వరల్డ్ కప్‌లో ఇద్దరూ చెరో గోల్ మాత్రమే చేశారు. టోర్నీలో రొనాల్డో ఆరు మ్యాచుల్లో ఆడాడు. మొత్తం 484 నిమిషాలు మైదానంలో ఉన్నాడు. కానీ కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయగలిగాడు. ఇదే టోర్నీలో 121 నిమిషాలు మాత్రమే మైదానంలో నిలిచిన మెస్సి కూడా ఒక గోల్ చేయడంతోపాటు ఒక అసిస్ట్ కూడా నమోదు చేశాడు. మెస్సి ఈ టోర్నీలో మూడు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు.

2010 ప్రపంచకప్

2010 ప్రపంచకప్

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జరిగిన మరో ప్రపంచకప్‌లో 4 మ్యాచుల్లో మైదానంలో దిగిన రొనాల్డో.. 360 నిమిషాలు ఆడాడు. ఈ టోర్నీలో ఒక గోల్‌తోపాటు ఒక అసిస్ట్ కూడా నమోదు చేశాడు. అయితే ఈ టోర్నమెంట్‌లో మెస్సి అంతగా ఆకట్టుకోలేదు. మొత్తం ఐదు మ్యాచుల్లో కలిపి 450 నిమిషాలు ఆడిన అతను.. ఒక్క గోల్ కూడా చెయ్యలేదు. కేవలం ఒక అసిస్ట్ మాత్రమే చేయగలిగాడు.

2014 వరల్డ్ కప్

2014 వరల్డ్ కప్

ఈ వరల్డ్ కప్‌లో మెస్సి తన పీక్స్‌లో కనిపించాడు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఏడు మ్యాచుల్లో 693 నిమిషాల పాటు ఆడిన మెస్సి.. నాలుగు గోల్స్ చేయడంతోపాటు ఒక అసిస్ట్ కూడా చేశాడు. అయితే ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో రొనాల్డో కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే మైదానంలో దిగాడు. మొత్తం 270 నిమిషాలు ఆడిన అతను ఒక గోల్ చేసి, ఒక అసిస్ట్ నమోదు చేశాడు.

2018 ప్రపంచకప్

2018 ప్రపంచకప్

చివరగా జరిగిన ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో రొనాల్డ ఉగ్రరూపమే చూపాడు. కేవలం నాలుగు మ్యాచుల్లో 360 నిమిషాల పాటు ఆడిన అతను నాలుగు గోల్స్ చేశాడు. ఎటువంటి అసిస్ట్‌లు చేయకపోయినా ఒక్కడే గోల్స్ చేస్తూ అదరగొట్టాడు. ఈ టోర్నీలో మెస్సి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. తను కూడా నాలుగు మ్యాచుల్లో 360 నిమిషాల పాటు ఆడినా ఒక్క గోల్ మాత్రమే చేసి, రెండు అసిస్ట్‌లు అందించాడంతే.

మొత్తం వరల్డ్ కప్పుల్లో..

మొత్తం వరల్డ్ కప్పుల్లో..

ఇప్పటి వరకు ఈ ఇద్దరు లెజెండ్స్ ఆడిన వరల్డ్ కప్పుల్లో ఎంత గొప్పగా ఆడినా తమ జట్టుకు కప్పు అందించలేకపోయారు. తన కెరీర్‌లో 14 సార్లు ప్రపంచకప్ మ్యాచుల్లో మైదానంలో దిగిన రొనాల్డో మొత్తం 1474 నిమిషాలపాటు ఆడాడు. ఈ ఆటలో 7 గోల్స్ సాధించడంతోపాటు రెండు అసిస్ట్‌లు చేశాడు. అదే సమయంలో 19 సార్లు వరల్డ్ కప్ మ్యాచుల్లో ఆడిన మెస్సి.. మొత్తం 1624 నిమిషాలు ఆడాడు.

ఈ ఆటలో 6 గోల్స్ చేయడంతోపాటు 5 అసిస్ట్‌లు అందించాడు. 2014లో తన జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లినా చివరి మెట్టు ఎక్కలేకపోయిన అర్జెంటీనా జట్టు ఓటమి పాలైంది. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత ఈ ఇద్దరు ఫుట్‌బాల్ లెజెండ్స్‌లో ఎవరు బెస్ట్ అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది ఎవరు తమ జట్టుకు ఎలా ఆడతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Story first published: Tuesday, November 22, 2022, 17:42 [IST]
Other articles published on Nov 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+