Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బార్సిలోనాలో మెస్సీ భవితవ్యం ప్రశ్నార్థకమేనా?

బార్సిలోనా: ప్రతి ఒక్కరూ స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ జెయింట్స్ బార్సిలోనా ఎఫ్ సి ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన లియానెల్ మెస్సీ కాంట్రాక్ట్ కొనసాగింపుపైనే ఫుట్ బాల్ ఆటగాళ్ల సర్కిల్ లో చర్చించుకుంటున్నారు. 2018 జూన్ 30 వరకు మాత్రమే బార్సిలోనాతో మెస్సి కాంట్రాక్ట్ ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తున్నది. ఆయన జట్టుతో ఉంటారా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే కొనసాగుతున్నది.

కానీ మెస్సి ఇప్పటివరకు తన భవితవ్యమేమిటో నోరు విప్పి చెప్పలేదు. బార్సిలోనా జట్టుతోనే కొనసాగుతాడా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించనే లేదు. బార్సిలోనా ఎఫ్ సి మేనేజ్మెంట్‌తో కాంట్రాక్టును పునరుద్ధరించుకునే ఉద్దేశం అతడిలో లేదని మార్కా అనే పత్రిక రాసిన వార్తాకథనానికీ వివరణ ఇవ్వలేదు. మెస్సి ప్రతినిధులు కూడా సదరు వార్తాకథనంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Messi stays quiet after rumor he won't remain with Barcelona

జూలైలోనే తన వైఖరేమిటో జట్టు యాజమాన్యానికి జూలైలోనే తెలియజేశాడని మార్కా మ్యాగజైన్ పేర్కొంది. పన్నుఎగవేతకు పాల్పడినట్లు మెస్సీ తండ్రిని స్పానిష్ పన్నుఅధికారులు దోషిగా నిర్ధారించడం ఆయన క్రీడా జీవితం భవితవ్యంపై ప్రధాన భూమిక పోషించిందని మార్కా వ్యాఖ్యానించింది.

మెస్సీ, ఆయన తండ్రి కూడా ఎటువంటి తప్పిదం చేయలేదని పేర్కొన్నారు. తమపై వచ్చిన అభియోగాలను నిరాకరించారు. తమపై వచ్చిన అభియోగాలను ఉన్నతస్థాయి కోర్టులో సవాల్ చేస్తామని.. దానిపై ఎటువంటి వ్యాఖ్య చేయవద్దని కూడా చెప్పారని మార్కా మ్యాగజైన్ తెలిపింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+