రష్యా సాకర్ కప్ టోర్నీతో వినోదం పుష్కలం: సొంత జట్లకు రొనాల్డో, మెస్సీ

హైదరాబాద్: వచ్చేనెల రష్యాలో జరుగనున్న సాకర్ కప్ నిజంగానే వినోదాన్నిస్తుందని పోర్చుగల్ ఫుటబాల్ టీం మేనేజర్ జోస్ మౌరిన్హో అంచనా వేశాడు. రష్యాలో జరిగే సాకర్ కప్ టోర్నీలో ప్రధానంగా బ్రెజిల్, స్పెయిన్ ప్రధాన పోటీదారులుగా నిలుస్తాయని అంచనా వేశాడు. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లీగ' జెయింట్ ప్లేయర్లు లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తమ సొంత దేశాల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపాడు. అర్జెంటీనా జట్టుకు బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ, పోర్చుగల్ టీమ్‌కు రియల్ మాడ్రిడ్ జట్టు కీలక ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తాడని అన్నారు.

వ్యూహాత్మకంగా పటిష్ఠంగా బ్రెజిల్ జట్టు
ప్రీమియర్ లీగ్ టోర్నీ జట్టు మాంఛెస్టర్ యునైటెడ్ మేనేజర్ కూడా అయిన జోస్ మౌరిన్హో మాట్లాడుతూ నిజంగా బ్రెజిల్ వ్యూహం, మానసిక స్థైర్యాన్ని తాను అభిమానిస్తానని చెప్పాడు. సహజ సిద్ధమైన బ్రెజిల్ జట్టు ప్రతిభ సీరియస్‌గా, భౌతికంగా, వ్యూహాత్మకంగా శక్తిమంతంగా ఉన్నదని తెలిపాడు.

బ్రెజిల్ టీంకు పూర్తి డిఫెన్స్ మద్దతు ఇలా
బ్రెజిల్ టీం పూర్తిగా డిపెన్స్ సామర్థ్యం కలిగి ఉన్నదని, కొన్ని గోల్స్ చేసినా.. మంచి సపోర్టు బేస్ కలిగి ఉన్నదని జోస్ మౌరిన్హో తెలిపాడు. విలియన్, నేయ్మార్, ఫిలిప్పె కౌంటిన్హో, గ్యాబ్రియల్ జీసస్ తదితరులు అసాధారణ ప్రతిభ కలిగి ఉన్నారని చెప్పాడు.

రొనాల్డో ఉంటే పోర్చుగల్ జట్టుకు ఏదైనా సాధ్యమే
పోర్చుగల్ ఎంతో ఆసక్తికరమైన టీం, క్రిస్టియానో రొనాల్డో లేకుండా పోర్చుగల్ జట్టును ఊహించడం చాలా కష్టం, ఆయన ఆడితే ఏదైనా సాధ్యమేనని చెప్పాడు జోస్ మౌరిన్హో. సంప్రదాయ యూరోపియన్ జట్లు ఉన్నా స్పెయిన్ రియల్ టీమ్‌ను కలిగి ఉన్నదని చెప్పాడు. ఇతర యూరోపియన్ జట్లతో పోలిస్తే స్పెయిన్ జట్టు మెరుగైన స్థానంలో ఉంటుందని అంచనా వేశాడు.

సాకర్ కప్ టోర్నీ కోసం ఆసక్తిగా జోస్ మౌరిన్హో ఎదురుచూపులు
రష్యా వరల్డ్ కప్ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మౌరిన్హో అన్నాడు. మరో వారంలో రష్యాలో సాకర్ టోర్నీకోసం మాస్కో బయలుదేరి వెళుతున్నట్లు చెప్పాడు. సాకర్ కప్ ముగిసిన తర్వాత కుటుంబంతో వెకేషన్‌కు బయలుదేరి వెళుతున్నట్లు వివరించాడు జోస్ మౌరిన్హో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications