Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: మెస్సీ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే

బార్సిలోనా: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియానెల్ మెస్సీ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. సుదీర్ఘ కాలంగా తన గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్న అంటోనెల్లా రొక్కుజ్జోను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పానిష్ మీడియా వార్తా కథనాలు ప్రచురించింది. మెస్సీ ఫుట్‌బాల్ కెరీర్‌లో రిలీఫ్ లభించిన సమయాన్ని ఇందుకు వేదికగా మార్చుకోనున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది వేసవిలోగానీ, శీతాకాలంలో గానీ వారిద్దరూ వివాహం చేసుకోనున్నారని బుధవారం స్పానిష్ డైలీ మార్కా ఓ వార్తాకథనం ప్రచురించింది. కొంతకాలంగా వివాహం చేసుకోవాలని వారిద్దరూ భావిస్తున్నట్లు తెలిసింది. యుక్త వయస్కులుగా ఉన్నప్పడే రొక్కుజ్జోను మెస్సీ కలుసుకున్నాడని, అప్పటి నుంచే వారిద్దరి మధ్య స్నేహం చిగురించిందని తెలుస్తున్నది.

ఈ బార్సిలోనా సూపర్ స్టార్ తన పెండ్లి సొంతదేశం అర్జెంటీనాలోనే జరుపుకోవాలని తలపోస్తున్నాడు. వీరిద్దరి అనుబంధం 2007లో బయటపడింది. ఎఫ్ సి బార్సిలోనా క్లబ్ కుర్రాళ్లు తమ సహచర ప్లేయర్ మెస్సీ వివాహ తేదీ, ఫంక్షన్ కోసం ఆసక్తిగా ఉన్నారు.

బార్సిలోనాపై న్యాయస్థానం ఫైన్

బార్సిలోనాపై న్యాయస్థానం ఫైన్

నేయ్మార్ అనే ప్లేయర్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నందుకు ఎఫ్ సి బార్సిలోనాపై బార్సిలోనా న్యాయస్థానం రెండు జరిమానాలు విధించింది. పన్ను ఎగవేత ఉల్లంఘనల నేపథ్యంలో రెండు జరిమానాల్లో కలిపి 5.5 మిలియన్ల యూరోలు (5.8 మిలియన్ డాలర్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనిపై ప్రాసిక్యూషన్ ఇప్పటికే క్లబ్ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని న్యాయస్థానం విచారించింది. బార్సిలోనా న్యాయవాదులు రామోన్ గొమెజ్ పొంటి, క్రిస్టోబాల్ మార్టెల్ ప్రాసిక్యూషన్ ముందు ఒప్పంద పత్రాలను సమర్పించారు.

ధ్రువీకరించిన న్యాయస్థానం

ధ్రువీకరించిన న్యాయస్థానం

దీంతో న్యాయస్థానం జరిమానాను ధ్రువీకరించింది. ఒప్పందం ప్రకారం క్లబ్ మాజీ అధ్యక్షుడు సంద్రో రొసెల్, ప్రస్తుత అధ్యక్షుడు జోసెప్ మారియా బార్టొమౌ కలిసి ప్రభుత్వానికి ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నేయ్మార్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడంతో 2011, 2013లలో పన్ను ఎగవేతకు పాల్పడ్డారని వారిపై అభియోగం. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా చూయాలని ఆదేశించింది. బార్సిలోనా పన్ను ఎగవేత వల్ల 13.86 మిలియన్ డాలర్ల నష్టాన్ని చక్కదిద్దేందుకే న్యాయస్థానం ఈ జరిమానా విధించినట్లు తెలుస్తున్నది.

టేబుల్ టాపర్స్‌గానే చెల్సియా

టేబుల్ టాపర్స్‌గానే చెల్సియా

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీలో చెల్సియా జట్టు యధావిధిగా టాప్ స్థానంలో కొనసాగుతున్నది. దిగువ స్థానంలో ఉన్న సుందర్‌లాండ్ జట్టుపై 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. 2005 - 06 నుంచి ప్రస్తుత మాంఛెస్టర్ యునైటెడ్ కోచ్ జోస్ మౌరిన్హో సారధ్యంలో వరుసగా 10 విజయాలు సాధించింది చెల్సియా. సుదీర్ఘ విరామం తర్వాత చెల్సియా జట్టు తరఫున ఆడిన సెస్క్ ఫాబ్రెగాస్ గోల్ సాదించాడు.

గోల్స్‌ను ఆపడంలో కీలకపాత్ర

గోల్స్‌ను ఆపడంలో కీలకపాత్ర

మరోవైపు గోల్ కీపర్ థిబాట్ కౌర్టియస్ కూడా కీలక పాత్ర పోషించి పలు గోల్స్‌ను సేవ్ చేశాడు. మరోవైపు మిడెల్స్‌బౌగ్‌పై లివర్ పూల్ 3-0 స్కోర్ తేడాతో విజయం సాధించి ఆరు పాయింట్లు తగ్గి రెండో స్థానంలో నిలిచింది. మిడెల్ బ్రౌగ్‌పై లివర్ పూల్ ప్లేయర్ ఆడం లల్లానా రెండు గోల్స్ చేయడంతో జట్టు 34 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నది. క్రిస్టల్ ప్యాలెస్‌పై జ్లాటన్ ఇబ్రహింమోవిక్ చివరి క్షణంలో గోల్ సాధించడంతో మాంఛెస్టర్ యునైటెడ్ 2-1 స్కోర్ తేడాతో గెలుపొంది ఆరోస్థానంలో నిలిచింది.

నాలుగో స్థానంలో మాంఛెస్టర్ సిటీ

నాలుగో స్థానంలో మాంఛెస్టర్ సిటీ

చెల్సియా జట్టు కంటే 13 పాయింట్లు వెనుకబడి ఉంది. నాలుగో స్థానంలో ఉన్న మాంఛెస్టర్ సిటీ ప్లేయర్లు పాబ్లొ జెబాలెటా, డేవిడ్ సిల్వా సాధించిన రెండు గోల్స్‌తో టాప్ వాట్ఫోర్డ్ జట్టుపై 2 - 0 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్న టొట్టెన్హం హట్స్‌పూర్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సెన్ క్రుషితో హుల్ సిటీపై 3 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+