Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: ట్రోఫీ ముద్దాడిన మెస్సీ.. ఎంబాపే ఒంటరి పోరాటం వృధా

Mbappe lone fight did not get France over the fence. Argentina won the final in fashion.

ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరంభంలో సత్తా చాటిన అర్జెంటీనా తొలి హాఫ్‌లోనే రెండు గోల్స్ చేసి పైచేయి సాధించింది. ఈ సమయంలో కొంత తడబడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

దీంతో ఆట మొత్తం ఏకపక్షంగా, బోరింగ్‌గా సాగుతోందని అభిమానులు అనుకున్నారు. కానీ చివర్లో పుంజుకున్న ఫ్రాన్స్.. 80వ నిమిషంలో పెనాల్టీ కిక్ కు ఎంబాపే గోల్ చేశాడు. ఆ మరు నిమిషంలోనే మరో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. ఫ్రాన్స్ తరఫున అతనొక్కడే నాలుగు గోల్స్ చేయడం గమనార్హం.

సాధించిన మెస్సీ..

సాధించిన మెస్సీ..

ఎక్స్‌ట్రా టైంలో కూడా స్కోర్లు సమం అవడంతో మ్యాచ్ పెనాల్టీ కిక్స్ దశకు చేరింది. ఈ సమయంలో కూడా ఫ్రాన్స్ తరఫున ఎంబాపేనే తొలి గోల్ చేశాడు. అర్జెంటీనా తరఫున ముందుకొచ్చిన మెస్సీ..ఎప్పట్లాగే తన జీనియస్ ఉపయోగించి గోల్ చేశాడు. తర్వాత గోల్ చేయడంలో ఫ్రాన్స్ విఫలం అవగా.. అర్జెంటీనా గోల్ చేసింది. మూడోసారి కూడా అదే కథ రిపీట్ అయింది. మరుసటి ఛాన్స్ లో మౌని ఫ్రాన్స్ తరఫున గోల్ చేశాడు. అర్జెంటీనా తరఫున మోంటీల్ కూడా గోల్ చేయడంతో 4-2 తేడాతో అర్జెంటీనా చరిత్ర సృష్టించింది. ఎట్టకేలకు మెస్సీ తన కల నెరవేర్చుకున్నాడు. వరల్డ్ కప్ ముద్దాడాడు.

మెస్సీ మాయ చేసేశాడుగా..

మెస్సీ మాయ చేసేశాడుగా..

మ్యాచ్ ప్రారంభమైన 23వ నిమిషంలోనే అర్జెంటీనాకు ఇక పెనాల్టీ కిక్ దక్కింది. ఫ్రాన్స్ ఆటగాళ్లు ఫౌల్ చేసినట్లు నిర్ణయించిన రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని గోల్ చేసే బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్న అర్జెంటీనా సారధి లియోనెల్ మెస్సీ.. మరోసారి తనను అందరూ ఫుట్‌బాల్ జీనియస్ అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడు. పెనాల్టీ స్పాట్‌ నుంచి చూడచక్కని షాట్‌తో గోల్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఏంజెల్ డి మరియా కూడా తనకు దక్కిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 36వ నిమిషంలో అద్భుతమైన గోల్‌తో తమ జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఎక్స్ ట్రా టైంలో కూడా మెస్సీ సత్తా చాటాడు. 108వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి మళ్ళీ అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు.

ఎంబాపే ఒంటరి పోరాటం..

ఎంబాపే ఒంటరి పోరాటం..

ఆరంభం నుంచి మైదానంలో నెమ్మదిగా కదిలిన ఫ్రాన్స్ ఆటగాళ్లలో ఎంబాపే హుషారు నింపాడు. ఆట 80వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఓటమెండీ కారణంగా ఫ్రాన్స్ ఆటగాడు మౌనీ కింద పడ్డాడు. ఈ ఘటన పెనాల్టీ ఏరియాలో జరిగింది. దీంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ లభించింది. దీన్ని గోల్ చేసే బాధ్యతను తను తీసుకున్న కిలియన్ ఎంబాపే.. అద్భుతమైన షాట్‌తో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమీలియానో మార్టినెజ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ గోల్ చేసిన నిమిషం వ్యవధిలోనే ఎంబాపే మరో గోల్ సాధించాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత పైచేయి సాధించడం కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆట ఎక్స్‌ట్రా టైంకి వెళ్లింది. ఈ టైంలో కూడా అర్జెంటీనాకు ధీటుగా బదులు చెప్పాడు ఎంబాపె. 118వ నిమిషంలో తన మూడో గోల్ చేశాడు. దీంతో ఎక్స్‌ట్రా టైంలో కూడా రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి.

Story first published: Sunday, December 18, 2022, 23:50 [IST]
Other articles published on Dec 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+