కోల్ కతా: అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీపై ఎన్నో ఆశలు అన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే నాలుగో ప్రపంచ చెస్ టైటిల్ చేజిక్కించుకున్న ఆనంద్, అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ మెస్సీ తన ఫేవరెట్ ఆటగాడని చెప్పాడు. యూరో చాంపియన్ స్పెయిన్ జట్టు కూడా బాగుందని, అన్నాడు. 'వ్యక్తిగతంగా నాకు మెస్సీ ఆటంటే ఇష్టం. అతనే నా ఫేవరెట్. అలాగే అర్జెంటీనా రాణిస్తుందని ఆశిస్తున్నా.
ఇలాంటి మెగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు చెప్పండి. నేనైతే సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు చూసే ప్రయత్నంలోనే ఉన్నాను' అని విషీ అన్నాడు. ఈ ఏడాది చివర్లో లండన్ చెస్ క్లాసిక్ ఈవెంట్‌తో పాటు పలు టోర్నీల్లో ఆనంద్ పాల్గొననున్నట్లు అతని భార్య అరుణ తెలిపింది.