Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ మంచి స్నేహితుడు కాదు: రొనాల్డో సంచలన వ్యాఖ్యలు

మాడ్రిడ్: రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తన ప్రత్యర్థి క్లబ్ బార్సిలోనా జట్టులో కీలక ప్లేయర్ అర్జెంటీనా ఏస్ ఆటగాడు లియానెల్ మెస్సీ ఏమాత్రం తనకు ఏమాత్రం మంచి స్నేహితుడు కాదని వ్యాఖ్యానించాడు. కాకపోతే తమ ఇద్దరి మధ్య పరస్పరం గౌరవం మాత్రం ఉన్నదని చెప్పాడు. గత ఎనిమిదేళ్లుగా బాల్లోన్ డి'ఓర్ అవార్డుకు రొనాల్డో, మెస్సీ నామినేట్ అయిన నేపథ్యంలో రియల్ మాడ్రిడ్ స్టార్ ఆటగాడి వ్యాఖ్యకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పెర్పార్మెన్స్, ఎవరు గొప్పవారన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో రొనాల్డో మొండిగా వ్యవహరించే వాడే తప్ప, ఇద్దరి మధ్య బద్ధవైరమేమీ లేని కోచ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇదిలా ఉంటే తనకు శత్రువులు ఉంటే మంచిదని రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ రొనాల్డో అన్నాడు. తన వ్యవహారశైలిపై సహచర ఆటగాళ్ల విమర్శలను ఆహ్వానించాడు. తనను ద్వేషించే వారి విమర్శలు తనకు మరింత స్ఫూర్తినిస్తాయన్నాడు.

'నీకు శత్రువులు ఉంటే వారి అనుభవాలతో స్ఫూర్తి పొందొచ్చు' అని కోచ్ మ్యాగజైన్‌కు రొనాల్డో చెప్పాడు. 'నేను వాస్తవంగా ద్వేషించే వారిని కోరుకున్నా. వారు నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి చేయూతనిస్తారు' అని అన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఫిగో, రుయికోస్తా వంటి పోర్చుగీస్ ప్లేయర్లు పెద్ద పెద్ద లీగ్‌లలో మంచి పెర్పార్మెన్స్ ప్రదర్శించే వారని, ఆ స్థాయికి చేరుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు.

Messi and I are not good friends, admits Ronaldo

బాల్లోన్ డి'ఓర్ అవార్డుకు అసలైన అర్హుడు రొనాల్డో : కన్నావరో
ఇటీవల కొన్ని గేమ్స్‌లో సరిగ్గా స్కోర్ చేయకపోవచ్చుగానీ బాల్లోన్ డి'ఓర్ అవార్డుకు సరైన అర్హత కలవాడు రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మాత్రమేనని ఇందులో సందేహమే లేదని ఇటలీ మాజీ కెప్టెన్ కన్నావరో అన్నాడు. ఈ ఏడాది నుంచి బాల్లోన్ డి'ఓర్, ఫిఫా అంతర్జాతీయ ప్లేయర్ అవార్డులు వేర్వేరుగా ప్రకటించనున్నారు.

గత సీజన్‌లో మాడ్రిడ్ తరఫున అన్ని లీగ్ టోర్నీల్లో 51 గోల్స్ చేసిన రొనాల్డో.. ఇప్పటివరకు రెండుసార్లు బాల్లోన్ డీ' ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. బాల్లోన్ డీ'ఓర్ అవార్డు గెలుచుకున్న తర్వాత మాడ్రిడ్‌కు చాంపియన్స్ లీగ్, పోర్చుగల్‌కు యూరో 2016 ట్రోఫీ గెలుచుకోవడంలో రొనాల్డో కీలక పాత్ర పోషించాడు.

ఐఎస్ఎల్‌లో వ్యూహాలు పనిచేయవ్: హుగెస్
గత ఆరేడు నెలల్లో ఇండియన్ సూపర్ లీగ్ నిర్వహణ తీరు మారిపోయిందని న్యూ కాస్టిల్ యునైటెడ్ డిఫెండర్ అరోన్ హుగెస్ వ్యాఖ్యానించాడు. ఐఎస్ఎల్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్ ఈ దఫా డిఫెన్సివ్ ధోరణిలో రెండో స్థానం సంపాదించుకున్నది. ఈ సీజన్ లో సారధిగా హుగెస్ నాలుగు గోల్స్ మాత్రమే చేశాడు.

టీం రూపురేఖలు ఇదే విధంగా ఉంటాయని హామీనిచ్చిన హుగెస్.. గోల్స్ సాధించకపోతే తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నాడు. ఎల్లవేళలా డిఫెన్స్ పనిచేయదని, మొత్తం టీం రూపురేఖలు మార్చేయాల్సి ఉంటుందని తెలిపాడు. తాము శిక్షణలో మరింత పురోగతి సాధించాల్సి ఉన్నదన్నాడు.

మ్యాచ్‌ల్లో గెలుపొందడానికి కోచ్‌ల వ్యూహాలు మాత్రమే సరిపోవని తెలిపాడు. ఏ ఒక్క వ్యూహం సరిపోదని, ఈ లీగ్ లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమిదేనన్నాడు. భారత్ లో ఫుట్ బాల్ పురోగతికి ప్రతిపాదిత రోడ్ మ్యాప్ అమలుకు ఐఎస్ఎల్ ప్రాథమిక లీగ్ టోర్నీ మాత్రమేనన్నాడు. ఈ టోర్నీనిడివి ఏడు నెలల వరకు పొడిగిస్తేనే మ్యాచ్ ఫలితం సాధించొచ్చనన్నాడు. 'మా అనుభవాలు చాలా మంచిగా ఉన్నాయి. దానికి అనుగుణంగా మేం చేయాల్సింది మేం చేస్తాం' అని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+