న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: సెల్ఫ్ గోల్ చేసినా.. విజయంతో క్వార్టర్స్ చేరిన మెస్సీ జట్టు!

Messi gives a good start as Argentina reaches quarter finals

ఫిఫా వరల్డ్ కప్‌ 2022లో బ్యాడ్ లక్ వెంటాడుతున్న జట్టు అర్జెంటీనా. ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ కెరీర్‌లో ఇదే చివరి వరల్డ్ కప్. అందుకే దీన్ని ఎలాగైనా గెలవాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఒకానొక సందర్భంలో 2-0 తేడాతో సులభంగా గెలిచేలా కనిపించిన అర్జెంటీనా.. చివర్లో సొంత గోల్ వేసుకొని 2-1 కి ఆధిక్యాన్ని తగ్గించుకుంది. ఆస్ట్రేలియా జట్టు ఒక్క గోల్ చేసినా ఫలితం వేరేలా ఉండేది.

మెస్సీ షురువాత్..

మెస్సీ షురువాత్..

ఈ మ్యాచ్ ఆరంభం నుంచి అర్జెంటీనా పట్టుదలగా కనిపించింది. తొలి హాఫ్‌లో 61 శాతం సమయం బంతిని తమ వద్దనే ఉంచుకుంది. అయితే రెండు జట్లు కనీసం ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయాయి. అవి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇలాంటి సమయంలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. 35వ నిమిషంలో బాక్సులో నుంచి గోల్ చేశాడు. తాము కూడా గోల్ చేసి స్కోర్లు సమం చేయడానికి ఆస్ట్రేలియా ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అర్జెంటీనా జట్టు తొలి హాఫ్ టైంలో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

కీపర్ వల్ల మరో గోల్..

కీపర్ వల్ల మరో గోల్..

సెకండ్ హాఫ్‌లో ఎలాగైనా గోల్ చేయాలని ఆస్ట్రేలియా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో అర్జెంటీనా మాత్రం మరో గోల్ చేయగలిగింది. సెకండ్ హాఫ్ మొదలైన 12 నిమిషాల తర్వత ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాథ్యూ ర్యాన్.. బంతిని పాస్ చేయడానికి ఆలోచిస్తూ నిలబడిపోయాడు. దీంతో అర్జెంటీనా ప్లేయర్ జూలియన్ అల్వారెజ్ ముందుకు దూకి బంతి లాగేసుకున్నాడు. కీపర్ కూడా లేని ఖాళీ గోల్ పోస్టులోకి దాన్ని పంపి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

చివర్లో సెల్ఫ్ గోల్..

చివర్లో సెల్ఫ్ గోల్..

ఇదే జోరులో మరో గోల్ కూడా చెయ్యడానికి అర్జెంటీనా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివర్లో తమ గోల్ పోస్టు వద్ద జరిగిన తిక మక వల్ల సొంత గోల్ చేసుకుంది. 77వ నిమిషంలో సరిగా క్లియర్ చెయ్యలేకపోయిన హాఫ్ వ్యాలీని ఆస్ట్రేలియా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ క్రెగ్ గుడ్‌విన్ గోల్ చేయబోయాడు. ఈ క్రమంలో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్‌ను తాకిన బంతి నేరుగా వెళ్లి వాళ్ల గోల్ పోస్టులో పడింది. దీంతో దీన్ని సెల్ఫ్ గోల్‌గా ప్రకటించిన రిఫరీ.. ఆసీస్‌కు గోల్ అందించాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 2-1కి పడిపోయింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చెయ్యలేకపోవడంతో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది. ఈ జట్టు తమ తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటుంది.

Story first published: Monday, December 5, 2022, 9:55 [IST]
Other articles published on Dec 5, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X