మెస్సీకి వరల్డ్ కప్ గెలుచుకోవడం కలగానే మిగిలిపోనుందా..??

హైదరాబాద్: ప్రపంచకప్ ఆశలు పెట్టుకున్న మెస్సీ, మెస్సీపైనే ఆశలు పెట్టుకున్న కోట్ల మంది అభిమానులు, అర్జెంటీనా వాసులు అంతా గురువారం అర్ద రాత్రి జరిగిన మ్యాచ్‌తో నిరుత్సాహానికి గురైయ్యారు.
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లోకి భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ తొలి మ్యాచ్‌లోనే కాదు. రెండో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరిచాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక

ఒక గోల్‌తో సరిపెట్టి మ్యాచ్‌ను డ్రాగా ముగించి:
పసికూన ఐస్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం ఒక గోల్‌తో సరిపెట్టి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన మెస్సీ.. గురువారం రాత్రి క్రోయేషియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో కనీసం ఆ మార్క్‌ని కూడా అందుకోలేకపోవడంతో అర్జెంటీనా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. ఆ జట్టు నాకౌట్ దారులు దాదాపు మూసుకుపోయాయి.

మెస్సీ విఫలమవుతుంటే.. పోర్చుగల్ రొనాల్డొ అదిరిపోయేలా:
టోర్నీలో మెస్సీ పేలవంగా విఫలమవుతుంటే మరో స్టార్ పోర్చుగల్ ప్లేయర్ రొనాల్డొ అదిరిపోయే ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతనితో పోల్చి మెస్సీని మరింత కుంగదీస్తున్నారు విమర్శకులు. సుదీర్ఘకాలంగా ఫుట్‌బాల్ ఆడుతున్న మెస్సీ ఇప్పటి వరకు ఒక ప్రపంచకప్‌ను కూడా ముద్దాడలేదు.

2015, 2016 ఫైనల్లోనూ అర్జెంటీనాకి నిరాశ తప్పలేదు:
2014లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో 0-1 తేడాతో జర్మనీ చేతిలో అర్జెంటీనా ఓడిపోయింది. ఆ తర్వాత 2015, 2016 కోపా అమెరికా ఫైనల్లోనూ అర్జెంటీనాకి నిరాశ తప్పలేదు. దీంతో.. 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ.. మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ.. ఈసారి కూడా ప్రపంచకప్ గెలవాలనే అతని కోరిక నెరవేరేలా కనిపించడం లేదు.

మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్:
మరి కొద్ది రోజుల్లోనే 31లోకి అడుగుపెట్టనున్న మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్ కావొచ్చు. ఈ నేపథ్యంలో.. అతనికి వరల్డ్‌కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఏదనేది అదే గ్రూపుకు చెందిన అర్జెంటీనా సహచర జట్టు మరో మ్యాచ్ ఆడిన తర్వాత అర్జెంటీనా జట్టు దారి ఎటు అనేది తేలిపోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications