Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫేవరెటైతేనే కష్టం: అర్జెంటీనాకు మెస్సీ చేయాల్సిందేమీ లేదు: డియాగో మారడోనా

Messi doesnt have to demonstrate anything for Argentina

హైదరాబాద్: బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ ఈ నెల 14వ తేదీ నుంచి రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా జట్టు కోసం కొత్తగా చేయాల్సిందేమీ లేదని డియాగో మారడోనా అన్నారు. 2014 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో తాను చేయాల్సింది తాను చేసేశాడని మారడోనా చెప్పారు. నాలుగేళ్ల క్రితం బ్రెజిల్‌లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్‌ ఫైనల్స్‌లో జర్మనీ చేతిలో ఓటమి పాలైంది. మారియో గోట్జే అదనపు టైంలో గోల్ చేయడంతో జర్మనీ జట్టుకు విజయం సాధ్యమైంది.

1986 మెక్సికో టైటిల్ అర్జెంటీనాకే

1986 మెక్సికో టైటిల్ అర్జెంటీనాకే

1986లో మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డియాగో మారడోనాను స్ఫూర్తిగా తీసుకుని గత ప్రపంచ కప్ టోర్నీలో అర్జెంటీనా స్ఫూర్తి పొందింది. 1986లో అర్జెంటీనా సారథిగా మారడోనా ప్రపంచకప్ టైటిల్ గెలుచుకోగా, నాలుగేళ్ల తర్వాత మెక్సికో ఓటమి పాలైంది.

 2016 తర్వాత కొంత కాలం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ దూరం

2016 తర్వాత కొంత కాలం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ దూరం

2016లో చిలీలో జరిగిన కొపా అమెరికా కాంటెనారోలో తాను ప్రాతినిధ్యం వహించిన జట్టు ఓటమి పాలైన తర్వాత కొంతకాలం పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు రిటైరయ్యారు లియానెల్ మెస్సీ. అయితే ప్రస్తుతం జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ప్రధాన పోటీదారు కాదని చెబుతున్నాడు మెస్సీ. కానీ డియాగో మారడోనా భిన్నంగా అభిప్రాయ పడుతున్నాడు.

మిస్టర్ మెస్సీ!! ఆడుతూ ఎంజాయ్ చేయండి

మిస్టర్ మెస్సీ!! ఆడుతూ ఎంజాయ్ చేయండి

‘నేను మెస్సీని కేవలం ఆడమని మాత్రమే సలహా ఇస్తున్నా. ఆటను ఎంజాయ్ చేయమని సూచిస్తున్నా. ఆయన విమర్శలను పట్టించుకోవద్దు. ఆయన ప్రపంచ కప్ గెలుచుకుంటారా? లేదా? అన్న విషయం తర్వాత? ఆయన ప్రత్యేక ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. నాకు కోచ్ జార్జి సంపౌలీ ఎలా ఆడతారో నాకు తెలియదు. కానీ చాలా మంది ప్లేయర్లు నాకు తెలుసు. వారంతా చాలా బాగా ఆడతారు' అని డియాగో మారడోనా చెప్పాడు.

ఫేవరెట్లైతే గెలుపొందడం కష్టమన్న మారడోనా

ఫేవరెట్లైతే గెలుపొందడం కష్టమన్న మారడోనా

‘గెలుపొందేందుకు వారి (అర్జెంటీనా)కి మంచి అవకాశం ఉన్నది. అర్జెంటీనాను నేను ఫేవరెట్‌గా పరిగణించను. ఫేవరెట్లు ఏనాడు టైటిల్ గెలుచుకోలేదు.'అని డియాగో మారడోనా తెలిపాడు. డియాగో మారడోనా, లియానెల్ మెస్సీ ఇద్దరూ అర్జెంటీనా ఆటగాళ్లే. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో వారి ముద్ర చెరుపలేనిది. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో హైతీని 4 - 0 స్కోర్ తేడాతో అర్జెంటీనా జట్టు ఓడించింది. మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో ఈ విజయం సాధ్యమైంది. ఈ నెల 16వ తేదీన ఇజ్రాయెల్ జట్టుతో అర్జెంటీనా తల పడనున్నది.

Story first published: Sunday, June 3, 2018, 12:34 [IST]
Other articles published on Jun 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+