హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో నేషనల్ లీగ్ టోర్నీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా శనివారం సాల్‌ఫోర్డ్ సిటీ-బ్రాడ్‌ఫోర్డ్ పార్క్ ఎవన్యూ జట్ల మధ్య పుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ 87వ నిమిషంలో సాల్‌ఫోర్డ్ సిటీ జట్టు గోల్ కీపర్ మ్యాక్స్‌కు టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చింది.
మ్యాచ్ ముగియడానికి కేవలం మూడు నిమిషాలు మాత్రమే సమయం ఉండటంతో అతడు గోల్ పోస్టుకు సమీపంలోనే టాయిలెట్ పోశాడు. ఈ విషయాన్ని కెమెరాలు పసిగట్టేశాయి. ఇంకేముంది ఈ విషయం అంఫైర్లకు తెలిసింది. దీంతో మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో మ్యాక్స్‌కు రెడ్ కార్డు చూపించి బయటకు పంపించేశారు.
ఈ మ్యాచ్‌లో మ్యాక్స్ ఆడిన సాల్‌ఫోర్డ్ సిటీ జట్టు 2-1తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మ్యాక్స్ ట్విటర్ ద్వారా అభిమానులను క్షమాపణలు కోరాడు. 'ఈ సంఘటనకు క్షమాపణలు కోరుతున్నా. ఇరు జట్లకు, అభిమానలకు సారీ చెబుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి ఘటన మళ్లీ జరగదు' అని పేర్కొన్నాడు.
అయితే, పుట్‌బాల్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2009లో ఛాంపియన్స్ లీగ్ సందర్భంగా జర్మనీ ఆటగాడు లెహ్మాన్ అచ్చం ఇలాగే చేశాడు.