For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుమ్ము రేపిన ఢిల్లీ కుర్రాళ్లు

చెన్నై: ఐఎస్‌ఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌ క్లబ్‌కు చ్కులు కనిపించాయి. 22 వేల మంది అభిమానుల హోరు మధ్య ఏకంగా 1 - 3 తేడాతో సొంత గడ్డపై ఢిల్లీ డైనమోస్‌ చేతిలో ఓటమి పాలైంది మాట్టరాజీ సేన.

చెన్నైయిన్‌ క్లబ్‌ సొంతగడ్డపై గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌లో బ్రెజిలియన్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు మార్సెలోపెరీరా తొలిహాఫ్‌లోనే రెండుసార్లు స్ట్రయికింగ్‌తో గోల్స్‌ చేసి డిఫెండర్లపై ఆధిపత్యం సాధించాడు. 26వ నిమిషంలో తొలి గోల్‌చేసిన మార్సిలోపెరీరా.. చెన్నై కూడా ఒక పాయింట్‌ సాధించేలోగానే రెండో గోల్‌ కొట్టి జట్టు విజయానికి బాటలు వేశాడు.

మ్యాచ్‌ అసాంతం ఢిల్లీ కుర్రాళ్లు కమాండింగ్‌ ప్రదర్శించారు. డిఫెన్స్‌తో చెన్నైని అన్ని విధాల కట్టడిచేశారు. బదారా బాద్జీ 86వ నిమిషంలో ముచ్చటగా మూడో గోల్‌చేసి చెన్నైని ఫలితానికి దూరం నెట్టేశారు.

ఐఎస్‌ఎల్‌ 3 ఎడిషన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా చెన్నైయిన్‌ గెలుపొందలేకపోయింది. కోల్‌కతాలో అట్లెటికో డీ కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే, డిఫెండింగ్‌ చాంపియన్‌గా, ఢిల్లీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లోనే తడబాటుతో కూడిన ఆటతీరు చెన్నైకిదే తొలిసారి. అయినా ప్రతిష్ఠంభన నుంచి బయట పడలేకపోయింది.

ఎనిమిదో నిమిషంలో మోహన్‌రాజ్‌ను నిలువరించి రాఫెల్‌అగస్టో. దుదూను అధిగమించి కొట్టిన బంతిని ఢిల్లీ గోల్‌కీపర్‌ తిరగ్గొట్టాడు. మరో నిమిషంలోనే జెజె లాల్పేఖులౌతో కలిసి బెర్నాండ్‌ మెండీ గోల్‌ కొట్టడానికి చేసిన ప్రయత్నాన్ని ఢిల్లీ గోల్‌ కీపర్‌ టోనీ డొబ్లాస్‌ అతి దగ్గర నుంచి వెనక్కు కొట్టాడు.

 Marcelinho stars in Delhi's 3-1 win over Chennaiyin FC

26వ నిమిషం వరకు చెన్నైయిన్‌ జోరు ప్రదర్శించిన తర్వాత మిలాన్‌సింగ్‌ రూపంలో పెనాల్టీ పాయింట్‌ గెలుచుకున్న తర్వాత కోలుకున్న ఢిల్లీ చివరిదాక అదే ఆధిపత్యం ప్రదర్శించింది. సౌవిక్‌చక్రవర్తిని అడ్డుకున్న మిలాన్‌ బంతిని తన ఆధీనంలోకి తీసుకుని గోల్‌ పోస్ట్‌కు పంపినా ప్రయోజనంలేకపోయింది. ఆ వెంటనే అప్రమత్తమైన బ్రెజిలియన్‌ ఫార్వర్డ్‌ మెర్సిలోపెరీరా.. చెన్నై గోల్‌ కీపర్‌ డువాయ్నే కెర్‌ను తప్పుదోవ పట్టించి బంతిని గోల్‌పోస్ట్‌ దరికి చేర్చాడు.

తర్వాత చెన్నై జట్టు గుక్క తిప్పుకునే అవకాశాన్నివ్వలేదు. మరో రెండు నిమిషాల్లోనే మార్సిలో ప్రత్యర్థుల డిఫెన్స్‌ను అధిగమించి బంతిని గోల్‌పోస్ట్‌కు పంపడంతో ఢిల్లీ 2 - 1 తేడాతో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. 32 నిమిషంలో చెన్నైకి చెందిన జెజె.. గోల్‌ కోసం విఫలయత్నం చేశాడు.

దీనికి తోడు ఢిల్లీ డైనమోస్‌ కుర్రాళ్ల ఢిపెన్స్‌తో దూదూ తేలిగ్గా స్పేస్‌ ఇచ్చేశాడు. ఢిల్లీ తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు దూసుకెళితే , చెన్నై కనీసం డ్రా దిశగా కూడా ఆలోచించలేకపోయింది.

ఇక రెండో హాఫ్‌లో ఢిల్లీ డైనమోస్‌ కంఫర్టబుల్‌గా వ్యవహరించింది. మరోవైపు చెన్నై ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను దెబ్బ కొట్టి ముందుకెళ్లాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒకవైపు 86వ నిమిషంలో మూడో గోల్‌తో ఢిల్లీ విజయ దరహాసంచేస్తుంటే.. చెన్నై కోచ్‌ మార్కో మాటరాజ్జీ చివరి 20 నిమిషంలో ముగ్గురు స్ట్రైకర్లను మార్చేశారు.

విజేతల్లా ఆడాం: జాంబ్రొట్టా

తమ జట్టు విజేత ఆటతీరు ప్రదర్శించిందని ఢిల్లీ కోచ్‌ జియాంలుకా జంబ్రొట్టా వ్యాఖ్యానించారు. తొలి15 నిమిషాలు వ్యూహం అమలుపై దృష్టి సారించామని, గొప్పగా ప్రయత్నించడం వల్లే విజయం సాధించగలిగామన్నాడు. ఢిల్లీ కెప్టెన్‌ ఆంటోనియో బాల్టాసార్‌ సంతానా జట్టు విజయం పట్ల సంతోషం వ్యక్తంచేశాడు. తాము ప్రత్యర్థి నుంచి స్పేస్‌ సంపాదించాలనిచేసిన ప్రయత్నం సక్సెస్‌ అయిందన్నాడు.

ఇక చెన్నై కోచ్‌ మాటరాజ్జీ మాత్రం ఈ మ్యాచ్‌లో విజయం ఢిల్లీదేనన్నాడు. మొత్తం జట్టులోనే ప్లేయర్లలో ఒక్కరిలోనూ పాయింట్లు సాధించాలన్న కసి కనిపించలేదన్నాడు. డిఫెన్సివ్‌ పొరపాట్లతోపాటు ఈ మ్యాచ్‌లో తమ కుర్రాళ్లు చేసిన ఆరేడు పొరపాట్లతో మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+