
హైదరాబాద్: ఫుట్‌బాల్ క్రీడకు భగవంతుడిలా భావించే మారడోనా ప్రస్తుతం అలిగాడట. అదీ ఎవరి మీదో కాదు. తన మొదటి భార్య మీదనే. ఇటీవలే తన మొదటి భార్య సంతానమైన డాల్మా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మారడోనా ప్రస్తుత భార్యను పిలవనందుకు నిరుత్సాహానికి గురైయ్యాడట. ఏప్రిల్ జరగనున్న ఈ పెళ్లికి తన మొదటి భార్య(ఒలివా) చేసిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
ఈ విషయమై అర్జెంటీనా మీడియా సాకర్ దిగ్గజం ఇలా ప్రవర్తించడం విచిత్రంగా ఉందంటూ వార్తలు గుప్పిస్తుంది. 'ఈ పెళ్లికి నేను రాకపోతే జరిగే నష్టమేమీ లేదు. తండ్రి లేకుండా పెళ్లి చేసుకుంటున్న వారిలో ఆమె ఒక్కత్తే ముందు కాదు. ఈమే ఆఖరు వ్యక్తి కూడా కాదు' అని మారడోనా వ్యాఖ్యానించారు.
ఇది నాకు చాలా బాధనిపించే విషయం. ఎందుకంటే నాకు డాల్మా అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె బొమ్మను కూడా నేను పచ్చబొట్టు వేయించుకున్నా. అలాంటిది ఇలా చేయడం ఏ మాత్రం సబబు కాదని మారడోనా మండిపడ్డారు. మారడోనాకు మొదటి భార్య సంతానమైన డాల్మా, జియన్నాలతో పాటు రెండో భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.