Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్‌లో ట్రోల్: రొనాల్డో సిక్స్ ప్యాక్ సంబరాలపై మాంచెస్టర్ ఫ్యాన్స్ మండిపాటు

Manchester United fans mock Juventus star for six-pack celebration after comeback victory in Turin

హైదరాబాద్: సాకర్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు క్రిస్టియానొ రొనాల్డో. పోర్చుగల్‌కు చెందిన ఈ స్టార్ ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ ప్లేయర్‌గా అభిమానుల చేత మన్ననలు అందుకుంటున్నాడు. కళ్లు చెదిరే గోల్స్ కొట్టడంలో క్రిస్టియానొ రొనాల్డో పెట్టింది పేరు. గోల్ అనంతరం రొనాల్డో జరుపుకునే సెలబ్రేషన్స్‌ కాస్త వింతగా ఉంటాయి.

తాజాగా చాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టుపై గోల్ కొట్టిన తర్వాత తనదైన స్టైల్‌లో రొనాల్డో సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు క్రిస్టియానొ ప్రియురాలు జార్జీనా రోడ్రిగ్వెజ్ సైతం హాజరైంది. ప్రస్తుత ఛాంపియన్స్ లీగ్‌లో ఇటలీకి చెందిన జువెంటస్ క్లబ్ తరఫున ఆడుతోన్న రొనాల్డో గోల్ అనంతరం గతంలో ఎన్నడూ లేని విధంగా సంబరాలు చేసుకున్నాడు.

ఆట 65వ నిమిషంలో గురి చూసి గోల్ పోస్ట్‌లోకి షూట్ చేసిన రొనాల్డో జెర్సీ పైకెత్తి తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ సంబరాలు జరుపుకున్నాడు. అదే సమయంలో జువెంటస్ గ్యాలరీలో ఉన్న తన ప్రియురాలు జార్జీనా రోడ్రిగ్వెజ్‌ను చూస్తూ సిక్స్ ప్యాక్‌ను కెమెరాలకు చూపించాడు. అయితే, రొనాల్డో సిక్స్ ప్యాక్ సెలబ్రేషన్స్ వెనుక మరో కారణం కూడా ఉంది.

సాకర్ ప్రపంచంలో రొనాల్డో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడంలో మాంచెస్టర్ యునైటెడ్ పాత్ర మరువలేనిది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌లో ఉండగానే రొనాల్డో అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగాడు. అయితే, తన ఎదుగుదలకు ఎంతో తొడ్పాటు అందించిన మాంచెస్టర్ యునైటెడ్ జట్టుపై గోల్ చేసిన ఆనందంలో రొనాల్డో చేసుకున్న సంబరాలు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Story first published: Thursday, November 8, 2018, 17:10 [IST]
Other articles published on Nov 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+