Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మౌరిన్హో సందేహం: రొనాల్డోను రియల్ మాడ్రిడ్‌ వదులుకోవడం కష్టమే

Manchester United could not reject a chance to sign Cristiano Ronaldo - Mourinho

హైదరాబాద్: లా లీగ జెయింట్ క్లబ్ రియల్ మాడ్రిడ్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతో ఒప్పందం చేసుకునే అవకాశం వస్తే వదులుకోబోమని మాంఛెస్టర్ యునైటెడ్ మేనేజర్ జోస్ మౌరిన్హో తెలిపారు. కానీ రియల్ మాడ్రిడ్ జట్టు మేనేజ్మెంట్ క్రిస్టియానో రొనాల్డోను వదులుకుంటుందా? అని అనుమానం వ్యక్తం చేశారు.

క్రిస్టియానో రొనాల్డో (33) పదేపదే రియల్ మాడ్రిడ్ జట్టు నుంచి వైదొలగాలని ఉన్నట్లు ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఇంతకుముందు మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు తరఫున ఆరు సీజన్లలో ఆడాడు. తాజాగా తనకు అవకాశం ఉన్న జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు.

రియల్ మాడ్రిడ్‌ను రొనాల్డో వీడటం సందేహమే

రియల్ మాడ్రిడ్‌ను రొనాల్డో వీడటం సందేహమే

క్రిస్టియానో రొనాల్డో తన జట్టును వీడతారా? అని సందేహించిన మౌరిన్హో.. అందుకు అవకాశం వస్తే దాన్ని దాటేయడం కష్ట సాధ్యమన్నారు. రొనాల్డో విక్రయంపై రియల్ మాడ్రిడ్ యాజమాన్యం నిషేధం అమలు చేస్తున్నదని తెలిపాడు. అమెరికాకు గానీ, మరే ఇతర దేశానికి వెళ్లేందుకు క్రిస్టియానో రొనాల్డోకు రియల్ మాడ్రిడ్ జట్టు యాజమాన్యం అనుమతించే వరకు ఆయన బయటకు రాలేరని అన్నారు. రొనాల్డో మరో జట్టులో చేరేందుకు అవకాశాలు లేవన్నదే నా అభిప్రాయం అని తెలిపారు.

మాంఛెస్టర్ యునైటెడ్ ప్లేయర్‌గా రొనాల్డో రికార్డులు

మాంఛెస్టర్ యునైటెడ్ ప్లేయర్‌గా రొనాల్డో రికార్డులు

మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు ప్లేయర్ గా క్రిస్టియానో రొనాల్డో రికార్డులు, చరిత్ర అందరికీ తెలుసునని జోస్ మౌరిన్హో పేర్కొన్నాడు. ఫుట్ బాల్ ఆటలో రొనాల్డో స్థానం రొనాల్డోకు ఉన్నదన్నాడు. కానీ క్రిస్టియానో రొనాల్డోతో సంతకం చేసేందుకు క్లబ్ యాజమాన్యాలు సిద్దమయ్యాయి. కాదని చెప్పలేమని మౌరిన్హో చెప్పాడు.

 నేడు చెల్సియాతో మాంఛెస్టర్ యునైటెడ్ ఎఫ్ఎ టైటిల్ పోరు

నేడు చెల్సియాతో మాంఛెస్టర్ యునైటెడ్ ఎఫ్ఎ టైటిల్ పోరు

శనివారం ఎఫ్ఎ క్లబ్ ఫైనల్స్ మ్యాచ్‌లో చెల్సియా జట్టుతో మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు తలపడనున్నది. జోస్ మౌరిన్హో తన కాంట్రాక్టును 2020 వరకు కొనసాగిస్తూ గత జనవరిలో మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు మేనేజ్మెంట్‌తో సంతకం చేశారు.

 మరో 15 ఏళ్లు మేనేజర్‌గా వ్యవహరించనున్న మౌరిన్హో

మరో 15 ఏళ్లు మేనేజర్‌గా వ్యవహరించనున్న మౌరిన్హో

జోస్ మౌరిన్హో మరో 15 ఏళ్లు మేనేజర్‌గా వ్యవహరించనున్నాడు. ఓల్డ్ ట్రాఫ్ఫోర్డ్ జట్టు మేనేజర్‌గా తన కెరీర్ ముగిసిపోదని భావిస్తున్నాడు. పోర్చుగల్ జాతీయ జట్టు మేనేజర్‌గా ఒకరోజు పని చేయాలని కలేమీ లేదన్నాడు. ‘నేను ఒకసారి రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నా.. ఆయన తనను రియల్ మాడ్రిడ్ జట్టు మేనేజర్‌గా ఉంటానని నమ్మలేదు. కానీ ఒక జాతీయ జట్టు పార్ట్ టైం మేనేజర్‌గా అనుకూలంగా వ్యవహరించలేం' అని జోస్ మౌరిన్హో చెప్పాడు.

Story first published: Saturday, May 19, 2018, 14:50 [IST]
Other articles published on May 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+