Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ జట్టును తక్కువ అంచనా వేయడం లేదు: మాంచెస్టర్ యునైటెడ్ బాస్

లూటన్ ఫుట్‌బాల్ క్లబ్ టీమ్‌ను తాము ఏ మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని మాంచెస్టర్ యునైటెడ్ బాస్ ఎరిక్ టెన్ హాగ్‌ తెలిపాడు. తమ ప్రత్యర్థులు ఎవరైనా వారిని గౌరవిస్తామన్నాడు. ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్‌ యునైట్ తమ తదుపరి మ్యాచ్‌ను లూటన్ క్లబ్‌తో ఆడనుంది. కెనిల్ వర్త్ రోడ్ మైదానం వేదికగా ఆదివారం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Erik ten Hag

లూటన్ టీమ్ తమ హోమ్ గ్రౌండ్ అయిన కెనిల్ వర్త్ రోడ్ మైదానంలో న్యూకాస్టిల్, బ్రైటన్‌ను ఓడించింది. లివర్‌పూల్, మాంచెస్టర్ జట్లతో డ్రా చేసుకుంది. అర్సెనల్ టీమ్ టీమ్‌తో తృటిలో ఓటమిపాలైంది. అయితే గత వారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం షెఫిల్డ్ చేతిలో లూటన్ ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడిన ఎరిక్ టెన్ హాగ్.. ఇతర మైదానాల మాదిరిగే కెనిల్ వర్త్ రోడ్ ఉంటుందని తెలిపాడు. 'ప్రత్యర్థి ఎవరా? అనే పట్టింపు లేదు. వాళ్లు ఉత్తమంగా ఆడారా? పేలవ ప్రదర్శన కనబర్చారా? అనేది కూడా మాకు అనవసరం. మేం ప్రతీ ప్రత్యర్థిని గౌరవిస్తాం. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసే స్థితిలో మేం లేం.

మేం మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే ఫోకస్ పెట్టాం. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం లూటన్ టీమ్ ఎంత అద్భుతంగా ఆడిందో మేం చూశాం. మరి ముఖ్యంగా గత వారం ఆ జట్టు ఆట తీరు చాలా మెరుగైంది. ఆ జట్టుపై నాకు ఎంతో గౌరవం ఉంది.

మేం మా అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటను ఆడేందుకు సిద్దంగా ఉన్నాం.'అని ఎరిక్ టెన్ హాగ్ చెప్పుకొచ్చాడు. లూటన్ టీమ్ 12 సార్లు తలపడిన మాంచెస్టర్ యునైటెడ్ 10 సార్లు విజయం సాధించి రెండు సార్లు డ్రా చేసుకుంది.

Story first published: Saturday, February 17, 2024, 16:35 [IST]
Other articles published on Feb 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+