రొనాల్డో కంటే మెస్సీ బెటర్: మాంఛెస్టర్ సిటీ కోచ్
హైదరాబాద్: పోర్చుగీస్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కంటే ఆయన ప్రత్యర్థి అర్జెంటీనా ఆటగాడు లియానెల్ మెస్సీ చాలా మెరుగైన, ప్రతిభావంతుడైన ఆటగాడని మాంఛెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గౌర్డియోలా వ్యాఖ్యానించాడు. దీర్ఘ కాలికంగా చర్చ పెట్టినా ఇందులో సందేహమే లేదన్నాడు.
చాంపియన్స్ లీగ్, యూరోపియన్ చాంపియన్స్ షిప్స్, క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ టైటిళ్ల విజయంతో రియల్ మాడ్రిడ్ హీరో క్రిస్టియానో రొనాల్డో నాలుగోసారి బాల్లోన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నా గానీ తన ప్రత్యర్థి ఎఫ్ సి బార్సిలోనా ఆటగాడు లియానెల్ మెస్సీ రికార్డును అందుకునేందుకు మరికొంత దూరంలో ఉన్నాడని చెప్పాడు.
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్)లో సోమవారం హుల్ సిటీపై లీగ్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఆదివారం పెప్ గౌర్డియోలా మీడియాతో మాట్లాడాడు. 'మెస్సీ చాలా బెస్ట్, ఖచ్చితంగా బెస్ట్ ప్లేయర్' అని నొక్కి వక్కాణించాడు.

ఎలా స్కోర్ సాధించాలో తెలిసిన వాడే మెస్సీ
‘ఆయనకు ఎలా ఆడాలో తెలుసు. జట్టులో ఇతర ప్లేయర్లను ఎలా ఆడాలో, ఆడించాలో, ఎలా స్కోర్ పాయింట్లు సాధించాలో తెలిసిన వాడు లియానెల్ మెస్సీ. ఆయన ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాడు. ఆయన అందరి పట్ల గౌరవంగా వ్యవహరిస్తాడు' అని చెప్పాడు. బాల్లోన్ డీ'ఓర్ అవార్డు గెలుచుకున్నందుకు తొలుత క్రిస్టియానో రొనాల్డోను అభినందించిన పెప్ గౌర్డియోలా.. మెస్సీ మరో స్థాయికి దూసుకెళ్తాడు అని అంచనా వేశాడు. ఇటీవల బార్సిలోనా మేనేజర్ లూయిస్ ఎన్రిక్యూ సైతం మెస్సికి బాసటగా నిలిచాడు. ఆయనతో ఇతర ప్లేయర్లను పోల్చే సాహసమే చేయొద్దని స్పష్టం చేశాడు.

టీనేజ్ బ్రెజిలియన్‌పైనే ఈయూ క్లబ్‌ల కన్ను
టీనేజ్ బ్రెజిలియన్ ఫుట్ బాల్ మిడ్ ఫీల్డర్ థియాగో మాయియా (19)పై పలు యూరోపియన్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లు మనస్సు పారేసుకున్నాయి. 2019 జూన్ వరకు బ్రెజిలియన్ క్లబ్ శాంతోస్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నఈ కుర్రాడి కోసం మొనాకో, స్కాల్కే, జెనిత్ సెయింట్ పీటర్స్ బర్గ్ క్లబ్ లు కూడా తమ జట్లలో అతడ్ని కలిపేసుకునేందుకు తహతహలాడుతున్నాయని చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. వచ్చే నెల 11 నుంచి వచ్చే సెలవుల్లో మాయియా తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనున్నట్లు తెలిపాడు.

91 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన మాయియా
‘నేను ప్రస్తుత పరిస్థితుల్లో మరో జట్టుకు ట్రాన్స్ ఫర్ కావాలా? వద్దా? అన్న అంశాన్ని శాంతోస్, నా ప్రతినిధులు నిర్ణయిస్తారు' అని ఈ మిడ్ ఫీల్డర్ మాయియా వ్యాఖ్యానించినట్లు సమాచారం. మాయియా 2014లో ఫస్ట్ జట్టులో రంగ ప్రవేశంచేశాడు. అప్పటి నుంచి 91 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. బ్రెజిల్ తరఫున అండర్ - 14, అండర్ - 17, అండర్ - 20, అండర్ - 23 జట్లలో సభ్యుడిగా ఉన్న మాయియా.. గత ఆగస్టులో ముగిసిన రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ జట్టు స్వర్ణ పతకం సాధించడంలోనూ కీలక భూమిక పోషించాడు.

ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెరుగుపడిన ఇరాన్
ఏషియాన్ ఫుట్‌బాల్‌లో నంబర్ వన్ జట్టుగా నిలిచిన ఇరాన్.. ఫిఫా ర్యాంకింగ్స్ మెరుగు పర్చుకున్నది. తాజా ర్యాంకింగ్స్ లో ఇరాన్ 29వ స్థానానికి ఎగబ్రాకగా, రెండో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా 37వ స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో జపాన్ ఉంది. ప్రపంచ స్థాయిలో 82వ ర్యాంక్ గల చైనా.. ఆసియా ఖండంలో ఎనిమిదో ర్యాంక్ కలిగి ఉంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా, బ్రెజిల్, జర్మనీ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ 136వ ర్యాంక్ నుంచి 134వ ర్యాంక్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications