న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఎయిర్‌పోర్టులో రొనాల్డొ విగ్రహం మార్చారు.. స్వీట్లపై మెస్సీ, రొనాల్డొలు

Fifa World Cup 2018 : Cristiano Ronaldo Statue Changed
Maligned Ronaldo statue replaced at Madeira airport

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కప్ కోసం పోటీపడుతున్న ఆటగాళ్ల కంటే దాని కోసం ఎదురుచూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అభిమానానికి హద్దేముంది. దక్షిణ భారతంలో గుళ్లు కట్టించేంత అభిమానం ఉంటే, కొన్ని చోట్ల విగ్రహాలు పెట్టే నేపథ్యం లేకపోలేదు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ల విగ్రహాలు పలుచోట్ల అవతారమెత్తాయి. అయితే ఆఫ్రికా ఖండంలోని మడేరియాలో ఉన్న ఎయిర్‌పోర్టులో ఉన్న విగ్రహంపై చర్చ తలెత్తింది. ఎందుకంటే వారు ఉంచింది రొనాల్డో విగ్రహమే అయినా దాని ఆకృతి రొనాల్డొను పోలి లేదు.

గతేడాది మడేరియా ఎయిర్‌పోర్టులో క్రిస్టియానో రొనాల్డొ

గతేడాది మడేరియా ఎయిర్‌పోర్టులో క్రిస్టియానో రొనాల్డొ

గతేడాది మడేరియా ఎయిర్‌పోర్టులో పోర్చుగల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2016లో ఈ ఎయిర్‌ పోర్టు పేరును క్రిస్టియానో రొనాల్డో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌గాను మార్చారు. తాజాగా ఈ ఎయిర్‌ పోర్టులో ఉంచిన రొనాల్డొ విగ్రహాన్ని మార్చారట. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ విగ్రహాన్ని మార్చినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.

 రొనాల్డొ విగ్రహం పెట్టినప్పుడే అలా లేదని

రొనాల్డొ విగ్రహం పెట్టినప్పుడే అలా లేదని

గతేడాది రొనాల్డొ విగ్రహం పెట్టినప్పుడే చాలా మంది అది రొనాల్డొను పోలినట్లు లేదు. ఎఫ్‌-1 డ్రైవర్‌ డేవిడ్‌ కౌల్ట్‌హార్డ్‌లా ఉందని ఎంతో మంది నెటిజన్లు తమ అభిప్రాయం వెల్లడించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న విమానాశ్రయ అధికారులు కొద్ది రోజుల క్రితం రొనాల్డొ విగ్రహాన్ని మార్చినట్లు తెలిపారు.

రష్యాలో పర్యటిస్తోన్న రొనాల్డొ

రష్యాలో పర్యటిస్తోన్న రొనాల్డొ

ఈ విషయాన్ని రొనాల్డొ సోదరుడు కూడా ధ్రువీకరించాడు. ఈ కొత్త విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రొనాల్డొ విగ్రహం బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీ కోసం రొనాల్డొ రష్యాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా బుధవారం పోర్చుగల్‌.. మొరాకోను ఢీకొట్టనుంది.

 స్వీట్ మీద రొనాల్డొ, మెస్సీల బొమ్మలు

స్వీట్ మీద రొనాల్డొ, మెస్సీల బొమ్మలు

అభిమానం కట్టలు తెంచుకొని ఇటీవలే ప్రపంచ కప్ మ్యాచ్ చూడలేకపోయినా ఓ అభిమాని గమ్మత్తైన పని చేశాడు. తన ఇంటినే అభిమాన ఆటగాడు లియోనల్ మెస్సీని ప్రతిబింబించేలా కనిపించాలని ఇంటికి అవే రంగులు వేయించాడు. అంతేకాకుండా రంజాన్ సందర్భంగా చేసిన పార్టీలో ఏకంగా స్వీట్ మీద రొనాల్డొ, మెస్సీల బొమ్మలు తయారుచేయించి సంబరాలు జరుపుకున్నారు.

Story first published: Tuesday, June 19, 2018, 15:39 [IST]
Other articles published on Jun 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X