For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్రీ గోల్స్‌లో మలేషియన్ టాప్: మెస్సీ, నేయ్మార్ రికార్డు బద్దలు


 ఒక ఏడాదిలో టాప్ త్రీ గోల్స్ సాధించిన ప్లేయర్‌గా మలేషియా ఫుట్‌బాల్ ఆటగాడు మహ్మద్ ఫయాజ్ సుబ్రి నిలిచాడు. ఫిఫా షార్ట్ లిస్ట్‌లో లా లీగ లెజెండ్స్ లియానెల్ మెస్సీ, నేయ్మార్‌ల రికార్డులను అధిగమించాడు.

కౌలాలంపూర్: ఒక ఏడాదిలో టాప్ త్రీ గోల్స్ సాధించిన ప్లేయర్‌గా మలేషియా ఫుట్‌బాల్ ఆటగాడు మహ్మద్ ఫయాజ్ సుబ్రి నిలిచాడు. ఫిఫా షార్ట్ లిస్ట్‌లో లా లీగ లెజెండ్స్ లియానెల్ మెస్సీ, నేయ్మార్‌ల రికార్డులను అధిగమించాడు. మలేషియా సూపర్ లీగ్ టోర్నీలో పేనంగ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిడ్ ఫీల్డర్ మహ్మద్ ఫయాజ్ సుబ్రి గత ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రీ కిక్ ద్వారా గోల్స్ సాధించాడు.

1997లో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ లెజెండ్ రాబర్టో కార్లోస్ ఇంతకుముందు ఈ రికార్డు నెలకొల్పాడు. ఫుట్‌బాల్ ఆట పట్ల క్రేజీ గల మలేషియాలో మహ్మద్ ఫయాజ్ సుబ్రి 115 అడుగుల (35 మీటర్ల) దూరం నుంచి బంతిని గోల్ పోస్ట్ దారి మళ్లించి సంచలనం సాధించాడు. 'ఇది నాకు కొంత స్పెషల్. నేను ఎప్పటికి మరిచిపోను. గేమ్‌లో భవిష్యత్ మెరుగుదలకు ఇది ప్రేరణగా నిలుస్తుంది' అని ఫయాజ్ పేర్కొన్నాడు.

'ఇతర ఆటలతో పోలిస్తే ఫుట్‌బాల్ ఆట అందరినీ కలుపుతుంది. చైనీయులు, భారతీయులు, మలేషియన్లు తదితరులంతా నా గోల్ కే ఓటేశారు' అని ఫయాజ్ చెప్పాడు. పది ఫిపా పుస్కాస్ అవార్డుల తుది జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 2015 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు జరిగిన మ్యాచ్‌ల్లో సాధించిన గోల్స్‌పై నిర్వహించిన ఓటింగ్‌ వివరాలను ఫిఫా వెల్లడించింది.

ఈ జాబితాలో బ్రెజిల్‌కు చెందిన మార్లోన్, వెనిజులా ఉమెన్ ఫుట్‌బాల్ ప్లేయర్ స్టీఫెన్ రోచి, మహ్మద్ ఫయాజ్ సుబ్రి ఉన్నారు. ఈ విభాగంలో విజేత ఎవరన్నది వచ్చేనెల తొమ్మిదో తేదీన జ్యురిచ్ లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో తెలుస్తుంది. దీనిపై ఫయాజ్ స్పందిస్తూ అప్పటివరకు వేచిచూద్దామని అన్నాడు.

 Malaysia player beats Messi, Neymar to FIFA shortlist

శిక్షణలో గాయం: నెల రోజులు ఆటకు నాని దూరం

వాలెంసియా: లా లీగ లీగ్ టోర్నీ టీం వాలెంసియా ప్లేయర్ నాని ట్రైనింగ్ పొందుతుండగా గాయపడ్డాడు. దీంతో నెల రోజుల పాటు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పాటెర్నా స్పోర్ట్స్ సిటీలో జరుగుతున్నశిక్షణలో కుడి కాలు కండరాలు దెబ్బతిన్నాయి.

గురువారం చివరి క్షణాల్లో కుడి కాలు కండరాలు నొప్పిగా ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొన్ని వారాల పాటు మ్యాచ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని వాలెంసియా సిఎఫ్ క్లబ్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. లా లీగ టోర్నీలో మలాగా, రియల్ సోషిడాడ్ జట్లతో జరిగే మ్యాచ్‌లతోపాటు కొపాడెల్ రే లీగ్ లో లేగానెస్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

ఐ - లీగ్ టోర్నీ కోసం నెరోకా ఎఫ్ సి బిడ్

ఇంపాల్ కేంద్రంగా గల నెరోకా ఎఫ్ సి క్లబ్ వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐ - లీగ్ టోర్నీలో భాగస్వామి కానున్నది. ఎఫ్ సి బార్డెజ్ గోవా, మినర్వా అకాడమీ, చెన్నై సిటీ జట్లతోపాటు ఐ - లీగ్ లో పాల్గొననున్నది. ఇందుకోసం ఐ - లీగ్ యాజమాన్యానికి నెరోకా ఎఫ్ సి బిడ్ పత్రాలు సమర్పించింది.

ఐ - లీగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిని తెలియజేస్తూ వివిధ జట్లు సమర్పించే బిడ్ పత్రాలను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) కమిటీ ఈనెల రెండో వారంలో సమావేశం కానున్నది. బిడ్ల దాఖలుకు ఈ నెల ఎనిమిదో తేదీతో గడువు ముగుస్తుంది. ఇంతకుముందు కఠిన నిబంధనలు పెట్టడంతో ఐ - లీగ్‌లో చేరేందుకు ఆసక్తి చూపే జట్లను ఆకర్షించలేకపోయింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+