న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా అవార్డులు: ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న...

Luka Modric Wins FIFA Player of the Year to End Ronaldo-Messi Reign

హైదరాబాద్: ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ యువ సంచలనం లుకా మోడ్రిక్‌ను వరించింది. కొన్నాళ్లుగా ఫుట్‌బాల్‌లో ఆధిపత్యం చూపిస్తూ వస్తున్న లెజెండరీ ప్లేయర్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలకు షాక్ నిస్తూ క్రోయాటియా ప్లేయర్ 2018 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. సోమవారం ఫుట్‌బాల్ వ్యక్తిగత అవార్డ్స్‌లో భాగంగా ఫిఫా బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రధానం చేశారు.

వరల్డ్‌కప్ ఫైనల్స్ చేరడంలో లుకా మోడ్రిక్

వరల్డ్‌కప్ ఫైనల్స్ చేరడంలో లుకా మోడ్రిక్

ది రియల్ మాడ్రిక్, క్రొయాటియా మిడ్ ఫిల్డర్‌గా ఆడే లుకా మోడ్రిక్... మాడ్రిక్ జట్టుకు ఛాంపియన్స్ లీగ్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. క్రొయాటియా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్స్ చేరడంలోనూ లుకా మోడ్రిక్ పాత్ర ఎంతో ఉంది.

బెస్ట్ గోల్ అవార్డ్ మొహమ్మద్ సలాహ్‌‌కి

బెస్ట్ గోల్ అవార్డ్ మొహమ్మద్ సలాహ్‌‌కి

బెస్ట్ గోల్ అవార్డ్ ఈజిప్టియన్ ఫ్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్‌కి దక్కింది. 12 ఏళ్లుగా ఫైనల్స్‌ జాబితాలో ఉంటూ వచ్చిన మెస్సీకి ఈ సారి లిస్టులో చోటు కూడా దక్కకపోవడం విశేషం. ఛాంపియన్స్ లీగ్‌లో 44 గోల్స్‌తో రెడ్స్ టీంను ఫైనల్ చేర్చిన మొహమ్మద్ సలాహ్... ఎవర్‌టన్‌తో ఆడిన మ్యాచ్‌లో చేసిన గోల్‌కి పుస్కాస్ బెస్ట్ గోల్ అవార్డ్ పొందాడు.

బెస్ట్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ డిడియర్ డిస్‌ఛాంప్స్‌కి:

బెస్ట్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ డిడియర్ డిస్‌ఛాంప్స్‌కి:

ఫిఫా ప్రో టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో లుకా మోడ్రిక్‌తో పాటు, సెర్గియో రామోస్, రాపియల్ వారానే, మర్సిలో, డేవిడ్ దే జియా, డాని అల్వేస్, ఎన్‌జోలో కంటే, ఈడెన్ హాజార్డ్, కిలియన్ బంప్పే, మెస్సీ, రోనాల్డో‌లకు చోటు దక్కింది. ఫ్రాన్స్ జట్టు వరల్డ్‌కప్ గెలవడంలో ప్రధాన భూమిక పోషించిన కోచ్ డిడియర్ డిస్‌ఛాంప్స్‌కి బెస్ట్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కింది.

బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తిబాట్ కోర్టిస్‌కి

బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తిబాట్ కోర్టిస్‌కి

బెల్జియం గోల్ కీపర్ తిబాట్ కోర్టిస్‌కి బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కింది. బ్రెజిల్ ప్లేయర్ మార్తాకి బెస్ట్ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కగా, లియాన్ బాస్ రెనాల్డ్ పెడ్రోస్‌కి బెస్ట్ వుమెన్స్ కోచ్ అవార్డు సొంతమైంది.

Story first published: Tuesday, September 25, 2018, 17:22 [IST]
Other articles published on Sep 25, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X