రష్యన్ అభిమానులకే ఫిఫా పెద్దపీట: 8 లక్షల మంది ఫ్యాన్స్‌కు టిక్కెట్లు

హైదరాబాద్: ఇప్పటి వరకు అత్యధికంగా ఫ్యాన్స్‌కు కేటాయించింది రష్యన్లకే. 7,96, 875 మంది రష్యా సాకర్ అభిమానులకు టిక్కెట్లు కేటాయించిన ఫిఫా.. తర్వాతీ దశలో అమెరికాకు 80,161, బ్రెజిల్‌కు 65,863, కొలంబియాకు 60,199, జర్మనీకి 55,136, మెక్సికన్లకు 51,736, అర్జెంటీనియన్లకు 44,882, పెరూ పౌరులకు 38,544, చైనీయులకు 36,841, ఆస్ట్రేలియన్లలో 34,628 మందికి, ఇంగ్లండ్ పౌరుల్లో 30,711 మందికి టిక్కెట్లు కేటాయించామని గత వారం ఫిఫా ప్రకటించింది.

రష్యాకు ప్రపంచ దేశాల నుంచి తండోపతండాలుగా సాకర్ అభిమానులు:
అమెరికా, బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, మెక్సికో, అర్జెంటీనా తదితర ప్రపంచ దేశాల నుంచి సాకర్ అభిమానులు తండోపతండాలుగా తరలివస్తారని ఫిఫా టిక్కెట్ల విక్రయం నిర్ధారిస్తోంది. గత వారమే ఫిఫా ‘సాకర్' అభిమానుల కోసం 16,98, 049 టిక్కెట్లు కేటాయించింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే అభిమానులకు కేటాయించింది.

ఫిఫా టోర్నీ కోసం లుఫ్తాన్సా అదనంగా 85 విమాన సర్వీసులు:
ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒక్కటైన లుఫ్తాన్సా గ్రూప్.. రష్యాలో ‘సాకర్ సంరంభం' ప్రారంభం సందర్భంగా అదనంగా 85 విమాన సర్వీసులు నడుపనున్నట్లు ప్రకటించింది. సాకర్ వేడుకలు జరుగుతున్నన్ని రోజులు ఈ సర్వీసులు ప్రయాణికులకు ప్రత్యేకించి ఫుట్ బాల్ అభిమానులు, క్రీడాకారులు, అధికారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. మాస్కోతోపాటు రష్యాలోని 11 నగరాల్లో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఎనిమిది శాతం సేవలు పెరుగుతాయని లుఫ్తాన్షా:
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా తాము నిర్వహించే లుఫ్తాన్సా గ్రూప్ సేవలు ఎనిమిది శాతం పెరుగుతాయని అంచనా వేసింది. 85 అదనపు విమాన సర్వీసుల్లో 18 వేల మందికి ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. లుఫ్తాన్సా గ్రూప్ పరిధిలో ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్, బ్రస్సెల్స్ ఎయిర్ లైన్స్, స్విస్ ఎయిర్ లైన్స్ సేవలు అందిస్తున్నాయి. స్విస్ ఎయిర్ లైన్స్, బ్రస్సెల్స్ ఎయిర్ లైన్స్ సంస్థల యాజమాన్యాలు ఇంతకుముందే రష్యాలోని కలింగ్రాడ్, సోచి, సమర, రొస్టోవ్ ఆన్ డోన్ తదితర నగరాలకు విమాన సర్వీసులు కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.

ఈజిప్టు నుంచి రష్యా ‘సాకర్' విమాన సర్వీసుల టిక్కెట్ ధర 175 డాలర్లు:
గతనెలలో ఈజిప్టు విమానయాన సంస్థ ఈజిప్టు ఎయిర్ రష్యాకు అదనపు విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. గత నెలలో మీడియాతో మాట్లాడిన ఈజిప్టు ఎయిర్ సీఈఓ సఫ్వాత్ ముసాల్లమ్ రష్యాలో ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించడానికి వెళ్లే అభిమానుల టిక్కెట్ల ధర 175 డాలర్లు ఉంటుందని ప్రకటించారు. ప్రతి మంగళ, గురు, ఆదివారం నాడు రష్యాకు సాకర్ స్పెషల్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications