For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఒంటెపై ప్రేమ ప్రయాణం: రొనాల్డోకు సౌదీ స్టైల్లో సర్‌ప్రైజ్!

Cristiano Ronaldo: లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో, అతని ప్రియురాలు జార్జినా రోడ్రిగ్జ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఇబ్రహీం అల్ ఫరయాన్, వారికి ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఖరీదైన కార్లు, పెద్ద బంగ్లాల కంటే విభిన్నంగా, సంప్రదాయబద్ధమైన ఒంటెను బహుమతిగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ బహుమతి సౌదీ అరేబియా సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది.

జార్జినా రోడ్రిగ్జ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. "అవును, నేను నిశ్చితార్థం చేసుకుంటున్నాను" అని ప్రకటించారు. క్రిస్టియానో రొనాల్డో, జార్జినా రోడ్రిగ్జ్ 2016 నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్ నస్ర్ క్లబ్‌కు ఆడుతున్నారు. రొనాల్డో 2023 నుంచి క్లబ్‌లో భాగంగా ఉన్నాడు. 77 మ్యాచ్‌లలో 74 గోల్స్ చేశాడు. ఈ నేపథ్యంలో సౌదీ సంస్కృతికి చిహ్నమైన ఒంటెను బహుమతిగా ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం దేశ సంప్రదాయాలను గౌరవించడమేనని అల్ ఫరయాన్ వెల్లడించారు.

Love Ride on a Camel Cristiano Ronaldo Gets a Traditional Saudi Surprise Gift

అల్ ఫరయాన్ తన పోస్ట్‌లో.. "ఇది నా తరఫున మీ పెళ్లికి శుభాకాంక్షలు. ఈ వార్త వినడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ బహుమతి రియాద్‌లో మీ కోసం ఎదురుచూస్తోంది. మీకు, జార్జినాకు అభినందనలు" అని పేర్కొన్నారు. అల్ ఫరయాన్ గతంలో కూడా పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులకు విలువైన బహమతులు ఇచ్చారు. 2023లో బ్రెజిలియన్ మిడ్‌ఫీల్డర్ ఫాబిన్హోకి రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారు. అల్ ఫరయాన్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ గురించి విస్తృతంగా రాస్తూ.. ఆరు ఫిఫా ప్రపంచ కప్‌లను కవర్ చేశారు. అల్ ఫరయాన్ జర్నలిజంతో పాటు అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ గౌరవ పురస్కారాన్ని కూడా పొందారు.

Story first published: Monday, August 18, 2025, 11:41 [IST]
Other articles published on Aug 18, 2025
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+