కోల్ కతా: వచ్చే ఎడిషన్ నుంచి ఇండియన్ సూపర్ లీగ్ ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఎఐఎఫ్ఎఫ్ వాణిజ్య భాగస్వామి ఫుట్ బాల్ స్పోర్ట్స్ డెవలప్ మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్)తో కలిసి కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అట్లెటికో డీ కోల్ కతా క్లబ్ కు చెందిన వింగర్ సమీగ్ దౌటీ మాట్లాడుతూ 'ప్రొఫెషనల్ గా పిఫా క్యాలెండర్ కు అనుగుణంగా ఐఎస్ఎల్ లీగ్ ను నడిపితే అది బెస్ట్ లీగ్ గా మారుతుంది. ఈ క్లబ్ లన్నీ ఆసియా ఖండం స్థాయిలో పోటీపడే సామర్థ్యం సంతరించుకుంటాయి' అని మీడియాకు చెప్పారు.
'భారత ప్లేయర్లు (ఎఎఫ్ సి) చాంపియన్స్ లీగ్ ను సవాల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. సుదీర్ఘ కాలం సాగే లీగ్ వల్ల విదేశాల నుంచి చాలా మంది ఆటగాళ్లు భారత్ కు వచ్చేందుకు సహకరిస్తుంది' అని తెలిపారు. అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్న ఐఎస్ఎల్ లీగ్ లో పాల్గొనేందుకు 'ఐ-లీగ్'లోని కొన్ని జట్లను ఎంపికచేసి చాన్స్ కల్పిస్తే వచ్చే ఏడాది నుంచి ఐఎస్ఎల్ సుదీర్ఘ కాలం సాగే అవకాశముందన్నాడు.
తద్వారా భారత ప్లేయర్లు మరింత లబ్ధి పొందడానికి వీలవుతుందన్నాడు. ఇండియన్ టీం గోల్ కీపర్ గుర్ ప్రీత్ సింగ్ సంధూ మాదిరిగా విదేశాల్లో పోటీ పడటంలో వారి అద్రుష్టాన్ని పరీక్షించుకోవచ్చునన్నారు. గురుప్రీత్ సింగ్ ప్రస్తుతం నార్వేయన్ క్లబ్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారతీయ ఆటగాళ్లలో ప్రతిభ కొదవలేదన్నాడు.

సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడమే కాదు ప్రబీర్ దాస్ వంటి తన సహచర ఆటగాళ్లు తనతోనూ ఆడొచ్చని అన్నాడు. ప్రబీర్ దాస్ ఇదే తరహా ఆట ఆడితే నేషనల్ టీంలో చోటు దక్కించుకోగలుగుతాడని చెప్పాడు. కానీ ప్రబీర్ దాస్ మాత్రం ఐ - లీగ్ తో పోలిస్తే ఐఎస్ఎల్ ప్రత్యేకమైన, విభిన్నమైన లీగ్ అని తనతో అన్నాడని దౌటీ వ్యాఖ్యానించాడు.
సన్నాహాలు, శిక్షణ ప్రతి ఫుట్ బాల్ క్రీడాకారుడి మాదిరిగానే చేయాలని, తాను పొస్టిగ వంటి వారితో కలిసి ఆడతానని అనుకోలేదు.
ఫిఫా అప్రూవల్ అందుకున్న కోచి
కేరళలోని కోచి స్టేడియం మూడేళ్ల తర్వాత గుర్తింపు తెచ్చుకున్నది. భారత్ లో ఫుట్ బాల్ అండర్ - 17 వరల్డ్ కప్ నిర్వహణకు అనువైనదిగా కోచి స్టేడియం ఆమోదం పొందింది. ఫిఫా ప్రతినిధుల టీం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరిగే ఫిఫా అండర్ వరల్డ్ కప్ యూ - 17 మ్యాచ్ లను ఈ స్టేడియంలో నిర్వహించేందుకు అనువైందన్నది.
దీంతో యూ - 17 వరల్డ్ కప్ నిర్వహణకు అనుమతి పొందిన తొలి క్లబ్ అని టోర్నమెంట్ డైరెక్టర్ జావియర్ చెప్పి మీడియాకు తెలిపారు. స్టేడియంలో మరికొన్ని మార్పులు, చేర్పులు చేయాలని క్లబ్ నిర్వాహాకులకు సూచించారు. ఏర్పాట్లు అద్బుతమని, మిగతా అంశాలపై కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తామని చెప్పారు.
2013లో అప్పటి ఉమెన్ చాందీ ప్రభుత్వం కోచిలో ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమని, అందుకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అప్పటి నుంచి కోచిలో స్టేడియం ఆధునీకరణ పనులను ఎప్పటికప్పుడు ఫిఫా అధికారులు తనిఖీచేస్తూ సూచనలందిస్తూవచ్చారు.