Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త మేనేజర్ కోసం లివర్‌పూల్ క్లబ్ అన్వేషణ!

ఇంగ్లండ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ కొత్త మేనేజర్ కోసం అన్వేషిస్తోంది. అయితే నూతన మేనేజర్ ఎంపికకు సైంటిఫిక్‌గా అప్రోచ్ అవుతోంది. ప్రస్తుత లివర్‌పూల్ మేనేజర్ జుర్గెన్ క్లోప్ స్థానాన్ని భర్తీ చేసేవాడే కాకుండా జట్టుకు అన్ని విధాల ఉపయోగపడే వ్యక్తిని నూతన మేనేజర్‌గా ఎంచుకోవాలని లివర్‌పూల్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది.

Liverpool manager Jurgen Klopp waves

ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ ఏ పని చేసినా సరైన డేటాతోనే మొదలుపెడుతోంది. 2010లో లివర్‌పూల్ క్లబ్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ అమెరికన్ ఓనర్స్ వ్యాపారంలోని అనేక అంశాల కోసం ఒక విశ్లేషణాత్మక నమూనాను సిద్దం చేసుకున్నారు. ముఖ్యంగా వారి ట్రాన్సఫర్ పాలసీని తమ బోస్టన్ రెడ్ సాక్స్ బేస్‌బాల్ జట్టుకు ఉపయోగించే వ్యవస్థ ద్వారా రూపొందించారు.

'మేం పూర్తి సమాచారాన్ని, డేటాను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. ఫుట్‌బాల్ క్లబ్‌ను మేం ఇలానే నడిపిస్తాం.'అని ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్లీ హొగన్ అన్నారు. కొత్త మేనేజర్ ఎంపిక విషయంలోనూ సైంటిఫిక్‌గా అప్రోచ్ అవుతున్నట్లు చెప్పారు.

జుర్గెన్ క్లోప్ లివర్‌పూల్ జట్టుకు గుడ్‌బై చెప్పిన వెంటనే నూతన మేనేజర్‌గా జాబియర్ అలోన్సో ఒలానో పేరు ప్రముఖంగా వినిపించింది. స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్, మాజీ ప్రొఫెషనల్ ప్లేయర్ అయిన అలోన్సో తన తరంలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. కోచ్‌గాను అసాధారణ పనితీరు కనబర్చారు.

ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలేని ఆటగాళ్లు అనోన్సో పర్యవేక్షణలో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ప్రస్తుతం బుండెస్లిగా క్లబ్ బేయర్ లెవర్‌కుసెన్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న జాబియర్ అలోన్సో ఆ జట్టును అగ్రస్థానంలో నడిపించారు. లివర్‌పూల్ తదుపరి మేనేజర్ బాధ్యతలను స్వీకరించేందుకు జాబియర్ అలోన్సో రేసులో ఉన్నారు.

Story first published: Monday, February 5, 2024, 22:26 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+