న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA అవార్డులు: చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ

Lionel Messi wins best FIFA player of the year award for record 6th time - చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. 6వసారి ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో లివర్ పూల్ డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్, ఐదు సార్లు ఈ అవార్డు అందుకున్న క్రిస్టియానో రొనాల్డోలను లియోనల్ మెస్సీ అధిగమించాడు.

చివరగా లియోనల్ మెస్సీ 2015లో ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. గత సీజన్‌లో బార్సిలోనా జట్టుతో కలిసి స్పానిష్ లాలిగా టైటిల్ లియోనల్ మెస్సీ నెగ్గిన సంగతి తెలిసిందే. అన్ని పోటీల్లో కలిపి లియోనల్ మెస్సీ మొత్తం 58 గేమ్స్ ఆడి 54 గోల్స్ సాధించడంతో యూరోపియన్ లీగ్ గోల్డెన్ బూట్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.

ఎవడ్రా ఈ పిచ్చోడు: దినేశ్ కార్తీక్‌ను తిట్టిన దాదా, అసలేం జరిగిందో చెప్పిన యువరాజ్!ఎవడ్రా ఈ పిచ్చోడు: దినేశ్ కార్తీక్‌ను తిట్టిన దాదా, అసలేం జరిగిందో చెప్పిన యువరాజ్!

55 గేముల్లో 54 గోల్స్

మరోవైపు క్రిస్టియానో రొనాల్డో సైతం 55 గేముల్లో 54 గోల్స్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నప్పటికీ లియోనల్ మెస్సీ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అందుకు కారణం మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కోపా అమెరికా లీగ్ సెమీఫైనల్స్‌లో దాయాదుల పోరులో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది.

మెస్సీ vs డిజిక్ పోటా పోటీ

అయితే, ఈ ఏడాది లివర్‌పూల్ జట్టుని ఛాంపియన్ లీగ్ టైటిల్ విజేతగా నిలబెట్టిన డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్ కాదని మెస్సీకి ఈ అవార్డు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్‌లో యూరోపియన్ ఉత్తమ ప్లేయర్ అవార్డుని సొంతం చేసుకున్న డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్‌కే ఉత్తమ ఫిఫా ప్లేయర్ అవార్డు వరిస్తుందని అంతా ఊహించారు.

లా స్కాలా ఓపెరా హౌస్ అవార్డు కూడా

ఉత్తమ ఫిఫా అవార్డుతో పాటు లా స్కాలా ఓపెరా హౌస్ అవార్డు కూడా మెస్సీనే వరించింది. దీంతో అవార్డుల విషయంలో రొనాల్డోపై మెస్సీ పైచేయి సాధించాడు. 2007లో క్రిస్టియానో రొనాల్డో సైతం లా స్కాలా ఓపెరా హౌస్ అవార్డుని అందుకున్నప్పటికీ ఆరు ఫిఫా ఉత్తమ ప్లేయర్ అవార్డులతో మెస్సీ ముందంజలో ఉన్నాడు.

మేగాన్ రాపినోయ్‌కు మహిళా త్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

మేగాన్ రాపినోయ్‌కు మహిళా త్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

ఇక, మహిళా ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అమెరికా కో కెప్టెన్ మేగాన్ రాపినోయ్ గెలుచుకుంది. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఆనందంలో మాటలు రావడం లేదు. ఎవరైతే పార్టీకి కాస్త ఆలస్యంగా రావడం గమనించారో వారికి ఈ ఏడాది మహిళల ఫుట్‌బాల్‌కు నమ్మశక్యం కాని సంవత్సరం. నిజంగా నమ్మశక్యంగా లేదు. ప్రపంచకప్‌లో భాగం కావడానికి ఈ ఉత్సాహం అద్భుతమైనది" అని అన్నారు.

Story first published: Tuesday, September 24, 2019, 13:01 [IST]
Other articles published on Sep 24, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X