ఘనంగా మెస్సి వివాహం: భార్యకు గాఢమైన ముద్దు (ఫోటో)
హైదరాబాద్: అర్జెంటీనా పుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో తన చిన్ననాటి ప్రేయసి, సహజీవన భాగస్వామి ఆంటోనెల్లా రొకుజ్జోను 30 ఏళ్ల మెస్సీ శుక్రవారం (జూన్ 30) పెళ్లి చేసుకున్నాడు.
ఓ క్లబ్ తరపున ఆడేందుకు 13 ఏళ్ల వయసులోనే మెస్సీ స్పెయిన్‌కు వెళ్లాడు. అక్కడ తన స్నేహితుడు లూకస్ ద్వారా ఆమెతో పరిచయం ఏర్పడింది. లూకస్‌కి రొకుజో సమీప బంధువు. లూకస్ కూడా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.
నార్త్ అర్జెంటీనాలోని అత్యంత ఖరీదైన సిటీ సెంటర్ రోసరియో కాంప్లెక్స్‌లో మెస్సి, ఆంటొన్నాలా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఆంటోనెల్లా వేలికి వెడ్డింగ్ రింగ్ తొడిగి మెస్సి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఈ పెళ్లి వేడుకకు సుమారు 250 మందికి పైగా అతిరథ మహారథులు హాజరయ్యారు.
అత్యంత వైభవంగా జరిగిన మెస్సి వెడ్డింగ్
కాగా గత పదేళ్లుగా మెస్సి, ఆంటోనెల్లా రొకుజ్జో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు (తియాగో, మాటియో మెస్సీ) ఉన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు హాలీవుడ్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాళ్లు నైమర్, లూయిస్ సువరేజ్ సహా పలువురు తన భార్యలతో కలిసి హాజరు అయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల హాజరు
బార్సిలోనా ఎఫ్‌సి స్టార్ గెరార్డ్ పిక్ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. వీరితో పాటు పాప్ సింగర్స్ షకీరా, కార్స్ పుయోల్ కూడా హాజరయ్యారు. కొలంబియా పాప్ సింగ్ షీకీరా ఆహూతులను తన సంగీత కచేరీతో అలరించింది. ప్రముఖ స్పెయిన్ డిజైనర్ రోసా క్లారా రూపొందించిన డిజైనర్ గౌన్‌లో ఆంటోనెల్లా మెరిసి పోయింది.
ఫోటోలకు ఫోజులు
పెళ్లి వేడుక అనంతరం ఈ జంట ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే కవరేజ్ కోసం 150మంది జర్నలిస్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రత్యక్షంగా కవరేజ్‌కు మాత్రం అనుమతించలేదు. ఈ వివాహ కార్యక్రమానికి సుమారు 400 మందికి పైగా పోలీసు సిబ్బంది భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మెస్సి పెళ్లి గురించి దేశ వ్యాప్తంగా చర్చ
ఈ పెళ్లి గురించి ఆ దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుకను అర్జెంటీనాలో ఈ దశాబ్దంలోనే అత్యంత ఆడంబరమైన పెళ్లిగా చెప్పుకున్నారు. తన పెళ్లి కోసం లియోనల్ మెస్సి కూడా భారీగా ఖర్చు చేశాడు. ఈ క్రమంలో మెస్సి వివాహ విందులో ఏర్పాటు చేసిన మెనూ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
పెళ్లిలో మెస్సి ప్రత్యేక మెనూ
దీంతో ఈ పెళ్లిలో మెస్సి ప్రత్యేక మెనూ సిద్ధం చేశాడు. ఈ క్రమంలో మెస్సి వివాహ విందులో ఏర్పాటు చేసిన మెనూ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా 600మందికి పైగా ముఖ్య అతిథులు వస్తున్నారు. దీంతో ఈ పెళ్లిలో మెస్సి ప్రత్యేక మెనూ సిద్ధం చేశాడు.
హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు
ఈ శతాబ్దంలోనే అత్యంత వైభవంగా జరిగిన వేడుకల్లో మెస్సి వివాహం ఒకటని స్థానిక మీడియా పేర్కొంది. అతిథుల్లో చాలా మంది ప్రత్యేక విమానాల ద్వారా రోసారియా చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచే స్థానికులు మెస్సిని చూసేందుకు హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications