Lionel Messi: సంచలన నిర్ణయం తీసుకున్న సూపర్‌స్టార్

బ్యూనస్ ఎయిర్స్: సాకర్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సి (Lionel Messi) సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ డెసిషన్.. అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బార్సిలోనా ఫుల్‌బాల్ క్లబ్ (FC Barcelona) ప్రతిష్ఠను మసకబారేలా చేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎవరూ ఊహించని విధంగా ఈ సాకర్ సూపర్ స్టార్.. ఇన్నాళ్లు తాను ఆడుతూ వచ్చిన ఎఫ్సీ బార్సిలోనాను వీడబోతోన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే- తాను ఎఫ్సీ బార్సిలోనాను వీడనున్నట్లు ఎలాంటి సమాచారాన్ని కూడా ఇవ్వలేదు..కనీసం లీక్ చేయలేదు. హఠాత్తుగా ఈ నిర్ణయానికి వచ్చాడు.

కాంట్రాక్ట్ రెన్యూవల్..
ఎఫ్సీ బార్సిలోనాను వీడటానికి ప్రధాన కారణం.. కాంట్రాక్ట్ రెన్యూవల్. లియోనల్ మెస్సీతో కుదుర్చుకున్న కాంటాక్ట్ ఇదివరకే ముగిసింది. దీన్ని పునరుద్ధరించాల్సి ఉందా క్లబ్. రెన్యూవల్ చేయడంలో కొంత జాప్యం ఏర్పడింది. దీనికి కూడా కారణాలు లేకపోలేదు. అర్జెంటీనా ప్రభుత్వం ఇటీవల కొన్ని రకాల రెగ్యులేషన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో స్పోర్ట్స్ సెక్టార్‌ను కూడా చేర్చింది. క్రీడారంగాన్ని సైతం ఈ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల కాంటాక్ట్ గడువు ముగిసిన వెంటనే ఎఫ్సీ బార్సిలోనా దాన్ని పునరుద్ధరించలేకపోయింది.

తెగిన 21 ఏళ్ల అనుబంధం..
కాంటాక్ట్‌ను తప్పకుండా పునరుద్ధరిస్తుందంటూ వార్తలు వచ్చాయి. మెస్సీ స్టార్ ప్లేయర్ అని, అతన్ని ఎవరూ వదలుకోవడానికి సిద్ధపడరంటూ ఎఫ్సీ బార్సిలోనా సంకేతాలను కూడా పంపించింది. అదే సమయంలో- ఈ గ్రేట్ ఫుట్‌బాలర్.. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీనితో 21 సంవత్సరాల పాటు కొనసాగిన అనుబంధం తెగినట్టయింది. ఎఫ్సీ బార్సిలోనాతో తనకు ఉన్న అనుబంధాన్ని లియోనల్ మెస్సి ఉద్దేశపూరకంగానే తెంచుకున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తోన్నాయి.

గ్రేటెస్ట్ ప్లేయర్‌గా
మెస్సీ తప్పుకోవడం వల్ల ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎఫ్‌సీ బార్సిలోనాకు అసాధ్యమౌతుందనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. లియోనల్ మెస్సీ జట్టులో ఉన్న సమమంలో ఎఫ్‌సీ బార్సిలోనే అనేక టైటిళ్లను సొంతం చేసుకుంది. లా లిగా-10, కోపా డెల్ రే-7, ఛాంపియన్స్ లీగ్-4, ఫుట్‌బాల్ వరల్డ్ కప్-3లను గెలచుకుందా క్లబ్. తాను ఆడిన మ్యాచుల్లో 20 సార్లు మెస్సీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు సార్లు బాల్లన్ డీ ఆర్‌ను అందుకున్నాడు. ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెర పడినట్టయిందనే అభిప్రాయాలు క్రీడా ప్రపంచంలో వినిపిస్తోన్నాయి. ఓ బంగారాన్ని ఎఫ్‌సీ బార్సిలోనా కోల్పోయిందనే విశ్లేషణలు వ్యక్తమౌతోన్నాయి.

నిర్ధారించిన ఎఫ్సీ బార్సిలోనా
లియోనల్ మెస్సీ తమ క్లబ్‌ను వీడాడనే విషయాన్ని ఎఫ్సీ బార్సిలోనా నిర్ధారించింది. తమ క్లబ్‌లో అతను కొనసాగట్లేదని తెలిపింది. మెస్సీని కోల్పోవాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించింది. అతను చేసిన అద్భుతాలు చిరకాలం క్లబ్ చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొంది. మెస్సీ తీసుకున్న నిర్ణయం పట్ల అటు క్లబ్ గానీ.. ఇటు అతని అభిమానులు గానీ సంతృప్తికరంగా ఉండబోరని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మెస్సీ.. ఏ ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరతాడనేది ఇంకా తెలియరాలేదు.

ఏడాదిగా వాయిదా..
కొన్ని కీలక క్లబ్స్ అతని కోసం రెడ్ కార్పెట్ పరచడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మెస్సీ వంటి స్టార్ ప్లేయర్‌ను దక్కించుకోవడానికి ఆయా క్లబ్స్ డాలర్లను గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి మెస్సీ గత ఏడాదిలోనే ఈ క్లబ్‌ను వీడాలని నిర్ణయించుకున్నప్పటికీ.. అది వాయిదా పడుతూ వచ్చింది. 2020 ఆగస్టులోనే ఎఫ్‌సీ బార్సిలోనాను వీడాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి దాకా అధ్యక్షుడిగా ఉన్న జోసెఫ్ మారియా బార్టొమెయు తప్పుకోవడం, ఆయన స్థానంలో జోవాన్ లాపొర్టా.. మెస్సీని ఒప్పించడంతో ఈ ఏడాది కాలం పాటు అతను అదే క్లబ్‌లో కొనసాగడానికి కారణమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications