
హైదరాబాద్: అక్టోబరులో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా సూపర్‌స్టార్ తన హ్యాట్రిక్ స్కోరుతో యుకోడర్ జట్టును ఓడించి తన టీంకు విజయాన్ని తెచ్చి పెట్టాడు. ఏదో ఒక విషయంపై ఎప్పుడూ వార్తల్లో ఉండే స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి మళ్లీ పరాభవం ఎదురైంది.

అర్జెంటీనా రాజధానిలోని బ్యూనన్ఎయిర్స్‌లో ఉన్న మెస్సీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు రెండోసారి విరగ్గొట్టారు. ఈ సారి చీలమండల వరకు విరగ్గొట్టడంతో విగ్రహం పూర్తిగా నేలకొరిగిపోయింది.
ఇదే ఏడాది ఒకసారి నడుం వరకు విరగ్గొట్టడంతో మరమ్మతులు చేయించి ఉంచిన విగ్రహం నేలకూలింది. పడగొట్టిన వారెవరనేది తెలియరాలేదని సంబంధిత అధికారులు స్పష్టం చేసినట్లు అక్కడి స్థానిక పత్రిక జిన్హువా వెల్లడించింది.