Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త క్లబ్​తో లియోనెల్ మెస్సీ ఒప్పందం! ఛలో పారిస్!!

Lionel Messi Signing With French club PSG for two years, says reports.
Lionel Messi Joins Paris Saint-Germain On Two-Year Contract || Oneindia Telugu

పారిస్: స్టార్ ఫుట్‌బాలర్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్‌ మెస్సీ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం తెలిసింది. బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన మెస్సీ.. పారిస్​ సెయింట్​ జర్మైన్​ క్లబ్ ​(పీఎస్​జీ)​తో మంగళవారం కొత్త కాంట్రాక్ట్​కు అంగీకారం తెలిపాడని సమాచారం. ఈ ఒప్పందం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించుకునే అవకాశం కూడా పీఎస్​జీ కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కాంట్రాక్ట్​పై మెస్సీకి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. అతడి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

లియోనల్ మెస్సీ మంగళవారం ఉదయం బార్సిలోనా విమానాశ్రయానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 1:30 ఫ్రెంచ్ రాజధాని పారిస్‌కు విమానంలో బయలుదేరాడు. ఈ సమయంలో మెస్సీతో పాటు అతడి భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని తండ్రి జార్జ్, మెస్సీ ప్రతినిధి కూడా పారిస్‌కు వెళ్లారు. పారిస్​ సెయింట్​ జర్మైన్​ క్లబ్ ​(పీఎస్​జీ)​తో ఒప్పందం కుదుర్చుకోవడానికి మెస్సీ ఫ్రాన్స్ వెళ్లాడు. గత కొద్ది రోజులుగాపీఎస్​జీతో మెస్సీ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

లియోనెల్ మెస్సీ ఇటీవలే స్పానిష్ క్ల‌బ్ బార్సిలోనాతో త‌న‌కున్న రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సంగ‌తి తెలిసిందే. పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్ల‌బ్‌.. మెస్సీ లాంటి ఖ‌రీదైన ఆట‌గాన్ని కొన‌సాగించ‌డం అసాధ్యం. పైగా మెస్సీ త‌న ఫీజును మ‌రో 30 శాతం పెంచాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ పుకార్ల‌ను మెస్సీ ఖండించాడు. 'జీతం పెంచ‌డం కాదు.. 50 శాతం త‌గ్గించుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బార్సిలోనాలోనే కొన‌సాగ‌డానికి ప్ర‌య‌త్నించాను' అని మెస్సీ ఫేర్‌వెల్ సంద‌ర్భంగా చెప్పాడు. అయితే జీతం 50 శాతం త‌గ్గించుకోవ‌డం కాదు.. అస‌లు ఫ్రీగా ఆడ‌తాన‌న్నా అతడు బార్సిలోనాలో కొన‌సాగ‌డం కుద‌రదని రూల్స్ చెబుతున్నాయి.

ఫుట్‌బాల్‌లోనే కాదు ఏ గేమ్‌లో అయినా ఓ ప్లేయ‌ర్ ఓ టీమ్‌తో కొన‌సాగాల‌నుకొని.. ఫ్రీగా ఆడాల‌ని నిర్ణ‌యించుకుంటే అంతకంటే పెద్ద సంతోషం మరోటి ఉండదు. కానీ స్పానిష్ లీగ్‌లో మాత్రం అలా కుద‌ర‌దు. మెస్సీ త‌న ఫీజును 50 శాతం త‌గ్గించుకుంటాన‌ని చెప్పాడు. అస‌లు మొత్తానికే ఫ్రీగా ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నా మెస్సీకి ఆ అవ‌కాశం లేదు. నిజానికి మెస్సీ త‌న ఫీజును గ‌రిష్ఠంగా 50 శాతం కంటే త‌గ్గించుకోవ‌డానికే వీలు లేదు. స్పానిష్ నిబంధ‌న‌లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. అక్క‌డి ఉపాధి చ‌ట్టం ప్ర‌కారం.. ఎవ‌రైనా ఉద్యోగి త‌న వేత‌నంలో 50 శాతం మాత్ర‌మే కోత విధించుకోవ‌చ్చు. అంత‌కు మించి అవ‌కాశం ఉండ‌దు. ఆర్థిక‌ప‌ర‌మైన అవ‌క‌త‌వ‌క‌ల‌ను అడ్డుకోవ‌డానికి స్పెయిన్ ఈ నిబంధ‌న తీసుకొచ్చింది.

ఒక‌వేళ స్పెయిన్‌లో ఆ చ‌ట్టం లేక‌పోయినా కూడా లా లిగా నిబంధ‌న‌ల ప్ర‌కారం కూడా మెస్సీ బార్సిలోనాలో కొన‌సాగ‌లేడు. దీనికి కార‌ణం.. ఓ క్ల‌బ్ త‌న వార్షిక ఆదాయంలో ప్లేయ‌ర్స్‌కు చెల్లించాల్సిన గ‌రిష్ఠ మొత్తం 70 శాతం మాత్రమే. ఇప్పుడు బార్సిలోనా జీతాల నుంచి మెస్సీ జీతం మొత్తం తీసేసినా.. వారి వార్షిక ఆదాయంలో ఈ మొత్తం 95 శాతంగా ఉంది. అంటే 70 శాతం కంటే ఇప్ప‌టికే చాలా ఎక్కువే. ఆ లెక్క‌న మెస్సీ ఫ్రీగా కొన‌సాగాల‌న్నా.. అవ‌కాశం లేకుండా పోయింది. గ‌త కొన్నేళ్లుగా ఖ‌రీదైన ప్లేయ‌ర్స్‌తో కాంట్రాక్టులు కుదుర్చుకోవ‌డం బార్సిలోనాను ఆర్థికంగా దెబ్బ‌తీసింది.

Story first published: Tuesday, August 10, 2021, 20:03 [IST]
Other articles published on Aug 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+