Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామెంటేటర్ సంబరాలు: బార్సిలోనా తరుపున మెస్సీ 600వ గోల్ (వీడియో)

Lionel Messi Scores 600th Barcelona Goal, Commentators Jump For Joy - Watch

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ పుట్‌బాలర్ లియోనల్ మెస్సీ బార్సిలోనా జట్టు తరుపున 600వ గోల్‌ని నమోదు చేశాడు. ఛాంపియన్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి లివర్‌పూల్‌-బార్సిలోనా సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మెస్సీ ఈ అరుదైన ఘనత సాధించాడు. తొలుత లూయిస్‌ స్వారెజ్‌ ఓ గోల్‌ సాధించడంతో బార్సిలోనా 1-0 ఆదిక్యంలో నిలిచింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అయితే, రెండో అర్ధభాగంలో మెస్సీ రెండు గోల్స్ సాధించి బార్సిలోనా జట్టుని 3-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లడంతో పాటు ఆ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆట మరో 7 నిముషాల్లో ముగుస్తుందనగా మెస్సీ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా, బార్సిలోనా జట్టు తరుపున మెస్సీ 600వ గోల్ చేయడంతో ఇంగ్లాండ్‌ మాజీ ఫుట్‌బాలర్‌, కామెంటేటర్‌ గ్యారీ లైన్కేర్ ఆనందంతో ఊగిపోయాడు. కామెంటేటరీ బాక్సులోనే తన సహచర కామెంటేటర్ లియో గార్సియోతో సంబరాలు చేసుకున్నాడు. మెస్సీ చేసిన ఈ గోల్‌ (బార్సిలోనా తరపున 600వది) చర్రిత్రాత్మకం అని వ్యాఖ్యానించాడు.

కాగా, మ్యాచ్‌ అనంతరం మెస్సీ మాట్లాడుతూ "ఎప్పుడూ లేనంతగా ఈ రోజు మేం సమష్టిగా రాణించాం. అందుకే ఈ గెలుపు సాధ్యమైంది. మొదటి గోల్‌ సాధించి స్వారెజ్‌ మా గెలుపునకు బాటలు వేశాడు" అని అన్నాడు.

Story first published: Thursday, May 2, 2019, 14:33 [IST]
Other articles published on May 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+