మెస్సి పెళ్లిలో షకీరా పాట: వేదిక, అతిథుల వివరాలివే
హైదరాబాద్: బార్సిలోనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సి తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి ఆంటోనెల్లా రొకుజోను జూన్ 30 (శుక్రవారం)న పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సి అంటే అర్జెంటీనా వాసులకు వల్లమాలిన అభిమానం.
నార్త్ అర్జెంటీనాలోని జరిగే ఈ పెళ్లి గురించి ఆ దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుకను అర్జెంటీనాలో ఈ దశాబ్దంలోనే అత్యంత ఆడంబరమైన పెళ్లిగా చెప్పుకుంటున్నారు. తన పెళ్లి కోసం లియోనల్ మెస్సి కూడా భారీగా ఖర్చు చేస్తున్నాడని అక్కడి పత్రికలు రాసుకొచ్చాయి.
మెస్సి పెళ్లి వేడుకకు పాప్ స్టార్ షకీరాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, రొకుజుతో మెస్సి పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీళ్లకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మెస్సి వివాహం నార్త్ అర్జెంటీనాలోని రొసారియో నగరంలో జరగనుంది.
మెస్సి పెళ్లి వేడుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు:

వేదిక:
రొసారియో కాంప్లెక్స్‌లో ఉన్న సిటీ సెంటర్ పుల్‌మ్యాన్ హోటల్‌లో జరుగుతుంది. ఈ పెళ్లి వేడుకకు వచ్చిన అథితులో కోసం ప్రత్యేకంగా కాసినోను ఏర్పాటు చేశారు.

అతిథులు:
మెస్సి బార్సిలోనా ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు చెందిన పలువురు స్టార్ ఆటగాడు గెరార్డ్ పిక్యూ హాజరు కానున్నారు. మెస్సి పెళ్లి వేడుకను కవర్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా 155 జర్నలిస్ట్‌లు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 600 మంది ముఖ్య అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు.

ఫెర్పామెన్స్:
ఉరుగ్వేకు చెందిన పాప్ బ్యాండ్స్ రొంబాయ్, మరుమ ఈ వేడుకలో అలరించనున్నాయి.

వెడ్డింగ్ డ్రస్:
స్పానిష్ డిజైనర్ రోసా క్లారా డిజైన్ చేసిన పెళ్లి కుమార్తె డ్రస్సుని 29 ఏళ్ల ఆంటోనెల్లా రొకుజో ధరించనుంది. ఈ డిజైనర్ హాలీవుడ్ స్టార్లు ఇవా లంగోరియా, సోఫియా వెర్గారాలతో పాటు స్పానిష్ క్వీన్ లెటిజియాలకు సైతం డిజైన్ అనుభవం ఉంది.

వెడ్డింగ్ గిప్ట్స్:
ఈ పెళ్లి వేడుకకు అతిథులుగా వచ్చే వారు ఇచ్చి గిఫ్ట్‌లను మెస్సి దంపతులు లియో మెస్సి పౌండేషన్‌కు ఇవ్వనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications