Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పిఎస్జికి బదిలీ: మెస్సీ తండ్రి సంప్రదింపులు

బార్సిలోనా ఎఫ్ సి క్లబ్ యాజమాన్యంతో లియానెల్ మెస్సీ కాంట్రాక్ట్ 2018 జూన్ 30వ తేదీతో ముగుస్తుంది.

బార్సిలోనా: అర్జెంటీనా సూపర్ స్టార్ ఫుట్ బాలర్ లియానెల్ మెస్సీ తండ్రి జోర్జ్ మెస్సీ తన కుమారుడి బదిలీ కోసం సంప్రదింపులు ప్రారంభించాడు. స్పానిష్ చాంపియన్స్ జెయింట్ ఎఫ్ సి బార్సిలోనా నుంచి ఫ్రెంచ్‌లోని పారిస్ సెయింట్ జెర్మైన్ (పిఎస్జి)కి బదిలీ చేసేందుకు సంప్రదింపులు చేపట్టాడని మీడియాతో వార్తలు వచ్చాయి.

తన కుమారుడు లియానెల్ మెస్సీ బదిలీ గురించి పిఎస్జి డైరెక్టర్ ప్లస్ బార్సిలోనా మాజీ ప్లేయర్ పత్రిక్ క్లౌవర్ట్‌తో జోర్జ్ మెస్సీ చర్చించారని ఫ్రెంచ్ మీడియా 'ఆర్టిఎల్'ను ఉటంకిస్తూ స్పుట్నిక్ మరో కథనం ప్రచురించించింది. ప్రస్తుతం ఎఫ్ సి బార్సిలోనా క్లబ్ యాజమాన్యంతో లియానెల్ మెస్సీ కాంట్రాక్ట్ 2018 జూన్ 30తో ముగుస్తుంది.

ఈ అర్జెంటీనా ఫార్వర్డ్ ప్లేయర్.. ఎఫ్ సి బార్సిలోనాతో తన కాంట్రాక్టు కొనసాగించేందుకు ఆసక్తిగా లేడని గత నెలలో వార్తలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం మెస్సీ తండ్రి వివాదంలో చిక్కుకోవడమేనన్న వార్తలు ముందుకొచ్చాయి. అయితే వాటిని మెస్సీగానీ, ఆయన అధికార ప్రతినిధి గానీ ఖండించకపోవడం గమనార్హం.

అత్యధిక కాలం రెగ్యులర్ ప్రాతిపదికన పిఎస్జి తరఫున ఆడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 29 ఏళ్ల కుర్రాడు తన 13వ ఏట ఎఫ్ సి బార్సిలోనా క్లబ్‌లో చేరాడు. లా మాసియా ఫుట్ బాల్ అకాడమీ నుంచి ఎఫ్ సి బార్సిలోనా దూసుకెళ్తున్నది. తన 17వ ఏట బార్సిలోనా మెయిన్ టీంలో చేరిన మెస్సీ తన తరం ఫుట్ బాలర్లలో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.

 చిన్న క్లబ్‌ల కూటమికి పిఎస్జి ప్రాతినిధ్యం

చిన్న క్లబ్‌ల కూటమికి పిఎస్జి ప్రాతినిధ్యం

నాలుగుసార్లు చాంపియన్స్ లీగ్, ఎనిమిదిసార్లు లా లీగ, కొపా దెల్ రే టైటిల్ నాలుగుసార్లు మరికొన్ని ఇతర టీం ట్రోఫీలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. బార్సిలోనా ఈ అర్జెంటీనా ఫార్వర్డ్ ప్లేయర్ తన జట్టు తరఫున ప్రస్తుత సీజన్‌లో 47 గోల్స్, ఏడు అసిస్టెన్స్‌లు అందించాడు. గత ఆదివారం రియల్ సోషిడాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్ సమంచేసి మరో రికార్డు సాధించాడు. 27 ఏళ్లుగా చిన్న క్లబ్‌ల కూటమికి పిఎస్జి ప్రాతినిధ్యం వహిస్తున్నది.

రొనాల్డో వంటి ప్లేయర్లు కావాలి: జాబీ అలోంసో

రొనాల్డో వంటి ప్లేయర్లు కావాలి: జాబీ అలోంసో

బేయర్న్ మునిచ్ టీంకు రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వంటి స్టార్ ఆటగాడి అవసరం ఉన్నదని ఆ టీం మిడ్ ఫీల్డర్ జాబీ అలోంసో వ్యాఖ్యానించాడు. కొద్దికాలం గోల్స్ లేక విలవిలలాడుతున్న రియల్ మాడ్రిడ్‌కు గత రెండు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ సాధించి లా లీగ పాయింట్ల టేబుల్‌లో ఆరు పాయింట్ల ఆధిక్యంలో నిలిపాడు రొనాల్డో.

గెలుపులో కీలక పాత్ర

గెలుపులో కీలక పాత్ర

క్రిస్టియానో రొనాల్డోతోపాటు అలెంసో కూడా ఐదేళ్లపాటు రియల్ మాడ్రిడ్ జట్టులో ఆడటంతోపాటు లా లీగ, చాంపియన్స్ లీగ్, స్పానిష్ సూపర్ కప్, కొపా డెల్ రే టోర్నీల గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 2014 నుంచి బేయర్న్ మునిచ్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘క్రిస్టియానో పిచ్‌పై ఒక పద్ధతిని అవలంభించాడు. కేవలం సెంట్రల్ స్ట్రయికర్‌గా మాత్రమే కాక గోల్‌పోస్ట్‌కు అత్యంత కీలక దశలో ఆడతాడు. ఆయనకు బంతి ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టే అత్యధిక గోల్స్ చేయగలుగుతాడు. అందువల్లే 50 గోల్స్ చేయగలిగాడు.

ఆశ్చర్య పరిచిన రియల్ మాడ్రిడ్ కోచ్ జినెడిన్ జిడానే

ఆశ్చర్య పరిచిన రియల్ మాడ్రిడ్ కోచ్ జినెడిన్ జిడానే

ఆయన రికార్డులన్నీఅద్భుతమైన, వివాదరహితమైనవి' అని వ్యాఖ్యానించాడు. రియల్ మాడ్రిడ్ కోచ్ జినెడిన్ జిడానే కూడా ఒక కోచ్‌గా తనను ఆశ్చర్య పరిచాడని అలెంసో తెలిపాడు. గాలిలో అత్యంత చురుగ్గా స్పందించే టీంగా రియల్ మాడ్రిడ్ పరిగణనలోకి తీసుకుంటే మ్యాచ్‌ల్లో విజయానికి అవసరమైన వ్యూహాన్నే అమలుచేస్తుందన్నాడు. కౌంటర్ అటాకింగ్ జట్లలో బార్సిలోనా కూడా ఉందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+