Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిలియన్ డాలర్ల డీల్ వద్దన్న మెస్సీ.. మియామీతో డీల్ వెనుక ఉన్న కారణాలేంటి?

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పీఎస్‌జీతో తన డీల్ ముగిసిన తర్వాత బిలియన్ డాలర్లు ఇస్తానన్న సౌదీ క్లబ్‌ను కాదని అమెరికాలోని ఇంటర్ మియామీ క్లబ్‌లో చేరాలని డిసైడ్ అయ్యాడు. గతంలో ఆడిన బార్సిలోనా కూడా అతన్ని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించినా అతను కాదనడం గమనార్హం.

పీఎస్‌జీతో చివరి మ్యాచ్ ఆడిన మెస్సీని తమతో చేర్చుకోవాలని బార్సిలోనా, సౌదీకి చెందిన అల్-హిలాల్ క్లబ్‌లు చాలా ట్రై చేశాయి. వీటిలో అల్-హిలాల్ అయితే అతనికి ఏటా బిలియన్ డాలర్లు ఇస్తామని కూడా ఆఫర్ చేశాయట. ఇది ఫుట్‌బాల్ క్లబ్స్‌లో భారీ అమౌంట్. దానికితోడు క్రిస్టియానో రొనాల్డో వంటి స్టార్లు కూడా సౌదీలోని క్లబ్స్‌లో చేరారు.

 Lionel Messi rejects billion dollars deal to join Inter Miami

కాబట్టి మెస్సీ కూడా సౌదీ క్లబ్‌లో చేరితే ఎలాంటి ఆశ్చర్యం ఉండేది కాదు. కానీ కొంచెం మెరుగైన పోటీ ఉండే క్లబ్‌లో ఆడాలని మెస్సీ భావించాడు. ఇంటర్ మియామీతో డీల్‌లో మెస్సీకి ఏటా 50 మిలియన్ డాలర్లు అందుతాయట. అంతేకాదు, మరిన్ని డీల్స్ కూడా మెస్సీకి దక్కనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఇంటర్ మియామీ ద్వారా యాపిల్, ఆదిదాస్ వంటి కంపెనీలు పొందే లాభాల్లో మెస్సీకి వాటా దక్కనుంది.

అతని పేరిట జరిగే వ్యాపారాలు అన్నింట్లో మెస్సీకి వాటి ఇవ్వడం పెద్ద కష్టం కాదు. అలాగే మియామీలో మెస్సీకి సొంత ఇల్లు ఉంది. ప్రస్తుతం దాన్ని అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. అతను కనుక ఇంటర్ మియామీలో చేరితే.. అతను కుటుంబంతో సహా ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతాడని తెలుస్తోంది. వీటికితోడు రిటైర్‌మెంట్ తర్వాత ఈ క్లబ్‌లో షేర్లు కొనేందుకు కూడా మెస్సీకి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లు సమాచారం. ఇన్ని ప్లస్‌లు ఉండబట్టే మెస్సీ ఈ క్లబ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Story first published: Thursday, June 8, 2023, 15:00 [IST]
Other articles published on Jun 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+