Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

19 వరకు గడువు: కాంట్రాక్టుకు తొందర లేదన్న మెస్సీ

న్యూఢిల్లీ: 'ఐ - లీగ్' టోర్నీలో అడుగు పెట్టేందుకు కార్పొరేట్ జట్లకు గడువునిస్తున్నట్లు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ప్రకటించింది. ఈ నెల 19వ వరకు 'ఐ- లీగ్'లో చేరికకు అవసరమైన టెండర్ పత్రాలు సమర్పించొచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ బిడ్ గెలుచుకున్న ఫ్రాంచైసీలు వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న 'ఐ - లీగ్' టోర్నీలో భాగస్వామి కావచ్చు.

తర్వాత ఏషియాన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) క్లబ్ టోర్నీలోనూ ఆడేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది. అందుకు అనుగుణంగా అవసరమైన పత్రాలు, చర్యలు తీసుకోవాలని పేర్కొంది. చండీగఢ్ కేంద్రంగా పనిచేస్తున్న మినర్వా అకాడమీ ఎఫ్ సి, ఎఫ్ సి బర్డేజ్ గోవా బిడ్లు దాఖలుచేశాయి. ఎఫ్ సి బార్డెజ్ ఈ ఏడాదే ఏర్పాటైంది. ప్రస్తుతం ఫార్మర్ డెంపో, ఈస్ట్ బెంగాల్ మేనేజర్ అర్మాండో కోలాకో శిక్షణలో గోవా ప్రో లీగ్ టోర్నీలో ఆడుతూ టాప్ స్థానంలో నిలిచింది. గతేడాది చివరి దశలో మినర్వా క్లబ్ రెండో స్థానంలో నిలిచింది.

కాంట్రాక్ట్ పునరుద్ధరణ అప్పుడే కాదు: మెస్సీ

బార్సిలోనా: అర్జెంటీనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ ఇప్పటికిప్పుడే స్పానిష్ ఫుట్ బాల్ చాంపియన్స్ 'ఎఫ్ సి బార్సిలోనా' క్లబ్ ప్రాంఛైసీతో కాంట్రాక్ట్ పునరుద్ధరణకు ఆసక్తి కనబరచడం లేదని మీడియా వార్తల కథనం. గత జూలైలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఇబిజాకు వెళ్లాలని, దాని అనుమతి కోసం ఎఫ్ సి బార్సిలోనా అధ్యక్షుడు జోసెప్ మారియా బార్టోమౌకు ద్రుష్టికి తేవాలని మెస్సీ తండ్రి సూచించినట్లు స్పుట్నిక్ పత్రికలో కథనం వచ్చింది.

Lionel Messi Not to Renew Contract With Barcelona: Reports

ప్రస్తుతం మెస్సీ కాంట్రాక్ట్ 2018 జూన్ 30 వరకు కొనసాగుతుంది. కాంట్రాక్ట్ గడువు ముగిసే వరకు దాని గురించి ఆలోచించకుండా.. చివరదిశలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుసున్నది. ఇప్పటికే బార్సిలోనా ఫ్రాంచైసీ అధ్యక్షుడు బార్టోమౌ రెండుసార్లు మెస్సీతో సంప్రదింపులు జరిపాడు. కాంట్రాక్ట్ పునరుద్ధరణ సంగతి గుర్తుచేశాడు. మెస్సీతో కాంట్రాక్ట్ కోసం 273 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని బార్టోమౌ ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది.

అదే సమయంలో మెస్సీ ప్రతినిధులకు, బార్సిలోనా అధికారులకు మధ్య గత జూలై నుంచి ఇంత వరకు అధికారిక సంప్రదింపులేవీ జరుగలేదు. 29 ఏళ్ల ఈ అర్జెంటీనా కుర్రాడు 13వ ఏటనే బార్సిలోనా ఫ్రాంచైసీ సభ్యుడయ్యాడు. ఎఫ్ సి బార్సిలోనా ఫుట్ బాల్ అకాడమీ తరఫున క్రమంగా ఎదుగుతూ 17వ ఏటా ప్రధాన టీం సభ్యుడయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో ఎఫ్ సి బార్సిలోనా జట్టు చాంపియన్స్ లీగ్ టైటిల్ నాలుగుసార్లు, ఏడుసార్లు లా లీగా లీగ్ చాంపియన్ షిప్ టైటిళ్లతోపాటు ఆరు కోపా డెల్ రేస్, ఇతర టైటిళ్లను గెలుచుకున్నాడు.

మాటిక్‌తో మిడ్ ఫీల్డింగ్ కాంటేకు ఆహ్లాదకరమే

సహచర ప్లేయర్ నిమాంజ మాటిక్‌తో కలిసి దీర్ఘకాలంగా మిడ్ ఫీల్డ్‌లో పనిచేయడానికి కారణం కష్టపడటమేనని చెల్సియా మిడ్ పీల్డర్ గోలో కాంటే వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్)లో ఆంటోనియో కాంటే ప్రధాన కోచ్ సారధ్యంలో చెల్సియా జట్టు 3 - 4 - 3 ఫార్మాట్ వ్యూహంతో విజయవంతంగా ఆడుతూ 11 మ్యాచ్ ల్లో 25 పాయింట్లు గెలుపొందింది.

ఫ్రాన్స్ కు చెందిన కాంటే, సెర్బియా వాసి మాటిక్‌లతో కూడిన మిడ్ ఫీల్డింగ్ వికసిస్తుంది. ఇద్దరు ఆటగాళ్లు కూడా బంతిని వెనుకకు రప్పించుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ప్రత్యర్థి జట్టుకు అటాకింగ్ ఇవ్వగల నేర్పు కలిగి ఉన్నారు.

'చెల్సియా జట్టుకు చాలా మంచి మిడ్ ఫీల్డర్లు ఉన్నారు. కానీ నేను ఎక్కువశాతం మాటిక్ తోనే కలిసి ఆడతాను. దానికి కారణం అతడు మంచి ప్లేయర్. ప్రాక్టీస్ లో మేం కలిసి పనిచేస్తాం. కనుక గేమ్ లో ఎప్పుడేం చేయాలో మాకు అర్థం అవుతుంది, అవగాహనతో ముందుకు వెళ్లగలం' అని చెప్పాడు. 'నేను ముందు ఉంటే అతడు వెనుక భాగంలో ఉంటాడు. అతడు ముందు ఉంటే నేను వెనుక ఉంటాను. మా ఇద్దరి మధ్య పరస్పరం అంగీకరం, అవగాహనతో కూడిన బంధం ఉంది. మాది చాలా మంచి భాగస్వామ్యం' అని చెల్సియా క్లబ్ మ్యాగజైన్‌కు కాంటే చెప్పాడు.

కాంటే జూలైలో ఇపిఎల్ చాంపియన్స్‌లో ఆడేందుకు లైసెస్టర్ సిటీ ఫ్రాంచైసీని వదలి చెల్సియాలో 42.5 మిలియన్ డాలర్ల ఒప్పందంపై చేరాడు. బంతిని తన నియంత్రణలో ఉంచుకునేందుకు అనుసరిస్తున్న వ్యూహాన్ని బహిర్గతంచేశాడు. 'ఇంతకుముందు నేను ఆడిన క్లబ్‌లు కాయిన్, లైసెస్టర్‌లతో పోలిస్తే చెల్సియా విభిన్నం. మా నియంత్రణలో బంతి లేనప్పుడు అత్యధికంగా కౌంటర్ అటాకింగ్‌కే ప్రాధాన్యం ఇస్తాం' అని కాంటే వివరించాడు.

'బంతి ఆటగాడి కంట్రోల్ లో ఉంటేనే సమయంతోపాటు పరుగులు తీసేందుకు అవకాశం ఉంటుంది. మేం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టును కాపాడుకోవాల్సి ఉంటుంది. మా జట్టును గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకోసం చాలా కష్డపడతాను' అని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+