న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

బార్సిలోనాకు బైబై.. ఇక మెస్సీ దారెటు!!

Lionel Messi next move a mystery, Manchester City wants Maestro

బార్సిలోనా: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన అనూహ్య నిర్ణయంతో ఫుట్‌బాల్ ప్రపంచానికి షాకిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. 16 ఏళ్ల ప్రాయంలో బార్సిలోనా తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మెస్సీ.. మరో క్లబ్‌కు మారబోతున్నాడు.

2003లో తొలిసారి బార్సిలోనాకు ఆడిన ఈ మేటి స్ట్రైకర్ మెస్సీ‌ లెక్కకు మించి టైటిళ్లు సాధించిపెట్టాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో బార్సిలోనాకు 34 టైటిళ్లు అందించిన మెస్సీ.. 2019-2020 సీజన్‌లోనూ అదరగొట్టాడు. లాలీగా చాంపియన్‌షిప్‌లో 25 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మెస్సీ మెరిసినా.. బార్సిలోనా అనుకున్న రీతిలో విజయాలు సాధించలేకపోయింది. జట్టులో అన్నీతానై మెస్సీ ముందుండి నిడిపిస్తే.. సహచరుల నుంచి సహకారం అందలేదు. దీంతో 2007 తర్వాత తొలిసారిగా ఒక్క టైటిల్‌ కూడా లేకుండా బార్సిలోనా ఈ సీజన్‌ను ముగించింది.

12 రోజుల క్రితం చాంపియన్స్‌ లీగ్‌లో భాగంగా జర్మనీ క్లబ్‌ బయర్న్‌ మూనిక్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బార్సిలోనా 2-8 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. క్లబ్‌ సుదీర్ఘ చరిత్రలో భారీ ఓటమిని చవిచూసిన బార్సిలోనా.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బయర్న్‌తో మ్యాచ్‌లో మెస్సీ ఆకట్టుకున్నా.. స్థాయికి తగ్గ ఆటతీరును కనబరుచడంలో సహచరులు విఫలం కావడం బార్సిలోనా ఓటమికి కారణమైంది. అప్పటి నుంచి జట్టు వ్యవహార శైలిపై పెదవివిప్పని మెస్సీ.. బార్సిలోనాను త్వరలోనే వీడుతున్నాడన్న వార్తలు వచ్చాయి.

ఇక బార్సిలోనాను వీడేందుకు సిద్ధమైన లియోనల్ మెస్సీ.. ఏ క్లబ్‌కు ఆడుతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతడి భవిష్యత్ ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటగాడిగా కొనసాగుతున్న మెస్సీని అధిక మొత్తానికి సొంతం చేసుకునేందుకు ప్రముఖ క్లబ్‌లు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. అందులో పారిస్‌ సెయింట్‌ జర్మైన్‌, మాంచెస్టర్‌ సిటీ లాంటి క్లబ్‌లు ముందున్నాయి. మాంచెస్టర్‌ సిటీతో మెస్సీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

లియోనల్ మెస్సీని మాంచెస్టర్‌ సిటీ దక్కించుకునేందుకు అసలు కారణం ఆ జట్టు మేనేజర్ పెప్ గార్డియోలా. గార్డియోలాతో మెస్సీకి మంచి అనుబంధం ఉంది. 2008 మరియు 2012 మధ్య కాలంలో బార్సిలోనా జట్టుకు గార్డియోలా మేనేజర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో మెస్సీ ఉత్తమ ప్రదర్శన చేశాడు. రెండు ఛాంపియన్స్ లీగ్ మరియు మూడు లా లిగా టైటిళ్లు జట్టుకు అందించాడు. దీంతో మెస్సీ.. మాంచెస్టర్‌ సిటీతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి 33 ఏళ్ల మెస్సీ దారెటో చూడాలి.

ఐపీఎల్ 2020: ఢిల్లీకి భారీ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం!!ఐపీఎల్ 2020: ఢిల్లీకి భారీ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం!!

Story first published: Thursday, August 27, 2020, 22:51 [IST]
Other articles published on Aug 27, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X