మెస్సి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్: విగ్రహం పెట్టిన 5నెలలకే తొలగింపు..
భద్రతా కారణాల దృష్ట్యా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్నికోల్‌కతాలో తొలగించనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో మెస్సీ GOAT టూర్ సందర్భంగా అభిమానులు ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2022 FIFA వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్నట్లు ఉండే ఈ విగ్రహం గాలికి ఊగుతూ ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఇది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) తనిఖీలో తేలింది.
ఈ విగ్రహం సురక్షితంగా లేదని పశ్చిమ బెంగాల్ MLA శరద్వత్ ముఖర్జీ కూడా చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి అధికారులు దీనిని వెంటనే అక్కడ నుండి తీసేయాలని నిర్ణయించారు. కేవలం 27 రోజుల్లోనే తయారు చేసిన ఈ విగ్రహాన్ని వేరే ఏదైనా మంచి స్థలంలో మళ్లీ పెట్టడానికి అధికారులు కొత్త చోటు కోసం వెతుకుతున్నారు.
మెస్సి కాదు..నా ఫేవరెట్ ఫుట్‌బాల్ ప్లేయర్ అతనే: విరాట్ కోహ్లీ

మరోవైపు కోల్‌కతాలో జరిగిన మెస్సీ GOAT టూర్ తీవ్ర వివాదాలకు దారితీసింది. ఈ ప్రోగ్రామ్ టిక్కెట్లను తప్పుగా వాడారని, అలాగే పాస్‌ల జారీ విషయంలో ఒత్తిడి తెచ్చారని ఈవెంట్ ముఖ్య నిర్వాహకుడు సతద్రు దత్తా ఆరోపించారు.దీనిపై ఆయన పశ్చిమ బెంగాల్ మాజీ క్రీడా మంత్రి అరప్ బిస్వాస్‌పై వారం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏంటి..! మెస్సీ బాడీగార్డ్ జీతం రూ.27కోట్ల..!
ఈ ప్రోగ్రామ్ నిర్వహించడంలో చాలా తప్పులు జరిగాయి. రాజకీయ నాయకులు, VIPలు మాత్రమే మెస్సీ చుట్టూ తిరుగుతూ హడావుడి చేశారని అభిమానులకు కనీసం ఆయనను చూసే అవకాశం కూడా ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి. దీనికి తోడు మెస్సీ కూడా వేదిక నుండి చాలా త్వరగా వెళ్ళిపోవడంతో, భారీగా డబ్బులు పెట్టి టిక్కెట్లు కొన్న అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్ట్ లేక్ స్టేడియంలోని సీట్లను ధ్వంసం చేస్తూ, గేట్లను విరగ్గొట్టడానికి ప్రయత్నించారు. స్టేడియంలో బాటిళ్లు విసురుతూ విధ్వంసానికి దిగిన ప్రేక్షకులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications