
హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ మరో సారి తన సత్తా చాటాడు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేశాడు. దీంతో ప్రత్యర్థి జట్టును 4-0 తేడాతో ఓడించడంలో కీలకపాత్ర వహించాడు. వరల్డ్ కప్ వార్మ్ అప్ మ్యాచ్‌గా ఆడిన బార్సిలోనా వర్సెస్ హైతీ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లీడ్ తీసుకుని 17వ నిమిషంలో ఓ గోల్ చేశాడు. మరో 12 నిమిషాల తర్వాత మరో గోల్.. 65వ నిమిషాలకొక గోల్.. ఆ కాసేపటికి మరో గోల్‌తో ప్రత్యర్థి హైతీ జట్టుపై విజయం సాధించింది.
ఇలా మరి కొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ముందు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రత్యర్థులకు హెచ్చరిక పంపాడు. హైతీతో బుధవారం జరిగిన సన్నాహక మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ కొట్టాడు. తన 124వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 64వ గోల్ చేసిన మెస్సీ ఈసారి అర్జెంటీనా ప్రపంచకప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
బార్సిలోనా జట్టులో ఆటగాళ్లు అంతకుముందు మ్యాచ్‌లలో గాయాల కారణంగా ఓటమికి గురి కావాల్సి వచ్చింది. అలాంటిది ఈ సారి అగురో మంచి ఫామ్‌లో ఉండటంతో ప్రపంచకప్ విజయంపై ఆశలు చిగురించాయి.
జట్టును విజయపథంలో నడిపిద్దామని ఆశపడుతున్న లియోనల్ మెస్సీ బార్సిలోనా జట్టులో నుంచి సిల్లెస్సెన్ ఒప్పందం రద్దు చేసుకుంటాడేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడట. ఇప్పటికే ఇద్దరూ స్ట్రాంగ్ గోల్ కీపర్‌లు ఉన్నారు. అయినా సిల్లెస్సెన్ ఉండాల్సిందంటూ జట్టు యాజమాన్యం కూడా కోరుకుంటుందట. ఈ విషయంపై అతను కూడా కొన్ని సమస్యలున్నాయని అవి స్పష్టం చేసుకుంటానని, అంతేకానీ, ఫ్రాంచైజీల మీద వాదనకు దిగి గొడవలు చేసేవాడిని కాదన్నాడు.